కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో వరస దొంగతనాలతో ప్రజలు హడలి పోతున్నారు. ఒకే రోజు ఆరు దుకాణాలు తాళాలు బద్దలు కొట్టి చోరి యత్నానికి పాల్పడ్డారు. ఒక లేడిస్ కార్నర్ కు ఉన్న సి.సి కెమెరాను పగలగొట్టి, ,తలుపు చెక్క నుతొలగించి లోనికి చొరబడి దోచుకెళ్తోన్న దృశ్యం సి.సి.ఫుటేజిలో రికార్డుఅయ్యాయి. ఆదే దుకాణం ఎదురుగా ఉన్న కూరగాయల మార్కెట్లోని కిరణం అంగట్లో దూరి నూనె ప్యాకెట్లు, కారం ఎత్తుకెళ్లారు. కంబాలపాడు సర్కిల్ లోని రీ వైన్డింగ్ వర్క్ షాప్, చెప్పుల దుకాణంల లో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇటీవలి కాలంలో పాతపేట మెయిన్ బజార్ లోని బంగారు దుకాణం, ప్రజా వైద్యశాల వెనుక ఉపాధ్యాయుడి ఇంట్లో దొంగలు పడి 60 తులాల బంగారం ,8 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. శుక్రవారం నాడు తాజాగా శివ జువెల్లర్స్ లో 6 తులాల బంగారం ,18 కేజీ ల వెండి దోచుకున్నారు. ఈ ఘటనలు మరవక ముందే మరోసారి దొంగలు తమ ప్రతాపాన్ని చూపారు.