రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల పైన హిందూ విగ్రహాలు పైన రోజురోజుకు దాడులు జరుగుతూ ధ్వంశం చేస్తూనే ఉన్నారని అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం దోషులను గుర్తించకుండా చోద్యం చూస్తున్నారని హిందూ జేఏసీ మండిపడ్డారు ..శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి ఈడిగ రంగా గౌడ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బోయ క్రాంతి నాయుడు జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పులికొండ రాజశేఖర్ ల తో పాటు మరో కొంత మంది హిందూ జేఏసీ నేతలు పట్టణ సీఐ ఆదినారాయణ రెడ్డిని కలిసి గతంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం సెప్టెంబర్ 23 వ తేదీన బెంగళూరు మంత్రాలయం ప్రధాన రహదారిలోని పట్టణ సమీపాన ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి రోడ్డు పై పడేశారని అప్పట్లో భారతీయ జనతా పార్టీతో పాటు హిందూ మేధావులు హిందూ సంస్థలు ఆందోళన చేయడంతో అప్పటికప్పటికీ పోలీసులు కేసు నమోదు చేశారు కానీ దోషులను గుర్తించి ఇంతవరకు అరెస్టు చేయకపోవడం దారుణమని అన్నారు .అధికార నాయకుల కనుసైగలల్లో పోలీసులు వ్యవహరిస్తూ చట్టాలకు తూట్లు పొడవటం సరైంది కాదన్నారు .ఇప్పటికైనా ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేసి శిక్షింప చేయాలని లేని పక్షంలో హిందూ సమాజం అంతా కలిసి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.