YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బావ, బావమరదుల సవాల్

బావ, బావమరదుల సవాల్

అనంతపురం, జనవరి 9, 
హిందూపురం.. ఈ నియోజకవర్గం టీడీపీకి కంచు కోట..! ఈ కంచుకోటలో జెండా ఎగురవేయాలని ఇతర పార్టీలు ప్రయత్నించాయి. పార్లమెంట్ సీట్ అయితే ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ సొంతం చేసుకుంది కానీ.. ఎమ్మెల్యే పదవిని మాత్రం చేజిక్కించుకోలేకపోయింది. పార్టీ ఏదైనా కానీ గెలుస్తున్న వాళ్ళు.. ఓడిపోతున్న వాళ్లు నాన్ లోకల్ అనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా నందమూరి కుటుంబం సొంత ఊరు హిందూపురం కాకపోయినా కూడా 1983లో ఎన్టీఆర్ ను ఇక్కడి ప్రజలు గెలిపించారు. ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణలు హిందూపురం నుంచే అసెంబ్లీకి వెళ్లారు. బాలకృష్ణ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అందుకే గత ఎన్నికల్లో వైసీపీ కూడా గత ఎన్నికల్లో నాన్‌ లోకల్‌ లీడర్‌కే టికెట్‌ ఇచ్చింది. గత ఎన్నికల్లో నాన్‌ లోకల్‌ లీడర్‌ మాజీ పోలీస్‌ అధికారి మహ్మద్‌ ఇక్బాల్‌ను బరిలో దింపింది. మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే ఆయనకు వైసీపీ సీటు ఇచ్చింది.  హిందూపురంలో వైసీపీ నేత నవీన్‌ నిశ్చల్‌ గతంలో రెండుసార్లు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో నవీనే వైసీపీ అభ్యర్ధిగా అనుకున్నా ఆఖరి నిమిషంలో మహ్మద్‌ ఇక్బాల్‌కు టికెట్‌ ఇచ్చింది వైసీపీ. కానీ ఇక్బాల్‌ ఓడిపోయారు.. వైసీపీ హైకమాండ్ ఎమ్మెల్సీని చేసి హిందూపురం వైసీపీ ఇంఛార్జ్‌ బాధ్యతలు ఇచ్చారు. ఇక హిందూపురంలో నవీన్‌ నిశ్చల్‌ వర్గాన్ని ఇక్బాల్‌ పట్టంచుకోలేదని ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. అక్కడి నుండే వైసీపీలో లోకల్‌, నాన్‌ లోకల్‌ సమస్య మొదలైంది. నవీన్‌ పాల్గొనే ప్రతి సమావేశంలోనూ ఇదే అంశంపై చర్చ జరగడమే కాకుండా.. ఎక్కడి నుంచో వచ్చి హిందూపురంలో పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోబోమని అంటున్నారు‌. ఇక ఈ సమస్య రాను రానూ పెద్దదైతే వైసీపీకి ఎంపీ సీటు కూడా అక్కడ కోల్పోయే ప్రమాదం ఉంది. నవీన్ నిశ్చల్ స్థానికంగా బలమైన వ్యక్తే.. ఆయన అనుకుంటే వైసీపీలో అంతర్యుద్ధం మొదలయ్యేలా చేయగలడు. కాబట్టి ఈ లోకల్-నాన్ లోకల్ ప్రమాదం నుండి హిందూపురం వైసీపీ వీలైనంత త్వరగా బయటపడుతుందో లేదో..!

Related Posts