రాజమండ్రి, జనవరి 9,
ఏదెట్టా ఉన్నా సీనియర్లు సీనియర్లే. జనంలో ఫాలోయింగ్ లేకున్నా.. పార్టీలో సీనియర్ల అవసరం చాలా ఉంటుంది. సీనియర్లు కానీ.. కాస్త వెనక్కి తగ్గితే ఎవ్వారాల్లో చాలా మార్పులు వస్తయ్. జనాన్ని పోగేసే యంగ్ లీడర్లతో పాటు.. సీనియర్లు ముందుకు రాకుంటే ఏ పార్టీకి కలిసిరాదు. ఇప్పుడే బీజేపీ ఏపీ పాలిటిక్స్ లో కూడా ఇదే జరుగుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఎన్నో సమస్యలు ఉన్నయ్. కానీ... సీనియర్లు కలిసి రాక.. కేడర్ బలంగా లేక సోము వీర్రాజు ఒంటరి ప్రయాణం చేస్తున్నారు. ఏదో తన వెంట వచ్చే నలుగురితో వెళ్తున్నారే తప్ప.. సీనియర్లని తోడేసుకుని వాళ్ల వెంట వచ్చే వాళ్లు కూడా తోడుంటే చాలా కలిసొచ్చేది. కానీ.. బీజేపీలో పరిస్థితి కూడా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి లాగే మారింది. అందుకే.. పాపం సోము వీర్రాజు పోరు హోరెత్తడం లేదు.బీజేపీ ఏపీలో కూడా వర్గపోరే పెద్ద ప్రాబ్లమ్ అయింది. రెండోసారి కూడా ఒకే వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వడం కూడా ప్రాబ్లమ్ అయి కూర్చుంది. దీనికి తోడు కన్నా లక్ష్మీ నారాయణ లాంటి లీడర్లు పెద్దగా కలిసి రాకపోవడం మైనస్. యాక్చువల్ గా విగ్రహాల ధ్వంసం లాంటి విషయం.. బీజేపీకి చాలా కలిసొస్తుంది. ఈ టైంలో.. కానీ బండి సంజయ్ లాంటి లీడర్ ఏపీలో ఉంటే.. రాజాసింగ్ లాంటి లీడర్ ఏపీలో ఉంటే.. ఎంపీ అర్వింద్ లాంటి లీడర్ ఏపీలో ఉంటే.. ఆ విధ్వంసాలు వేరేలా ఉండేయి.
కానీ.. సోమూ వీర్రాజు ఎటూ పోలేకపోతున్నారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటు.. మిగతా సీనియర్లు కూడా ఆ చూద్దాంలే అన్నట్లు ఉంటున్నారు. బీజేపీలో జాయిన్ అయిన కొంతమంది లీడర్లు కూడా ఏమోలేఅన్నట్లు ఉంటున్నారే తప్ప.. ముందుకు రావడం లేదు. అందుకే.. పార్టీకి మైలేజ్ తెచ్చే అంశాన్ని ఉత్తిగే వదిలేసుకుంటున్నారు అని.. సొంత పార్టీలోనే ఇంటలెక్చువల్స్ అభిప్రాయ పడుతున్నారట.
ఇక పోతే.. ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలు కూడా బానే ఉన్నయ్. ముఖ్యంగా అమరావతి ఇష్యూ ఉంది. ఆ ఇష్యూలో కూడా బీజేపీ తగినంత మైలేజ్ తెచ్చుకోలేక పోతుంది. ఇకపోతే.. జనసేన ఎవ్వారంలో కూడా నో క్లారిటీస్. ఇద్దరికీ పొత్తులు కుదరడం లేదు. దొందూ దొందే అన్నట్లు తయారయ్యాయి పార్టీలు. అందుకే.. సోమూ వీర్రాజు ఏదో నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో. మరోసారి రామతీర్థం పర్యటన పెట్టుకుని.. కాస్త లాక్కు రావాలని ప్లాన్ వేస్తున్నారు. ఏమాత్రం వర్కవుట్ అవుతుందో చూడాలి.