YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

21 ప్లస్ కే సిగరెట్

21 ప్లస్ కే సిగరెట్

హైదరాబాద్, జనవరి 9,
సిగరెట్.. ఏటా ఎంతో మంది ప్రాణాలను తీస్తోంది. చిన్న వయసులో ఉన్న వాళ్లు కూడా సిగరెట్లకు బానిసలు అవుతూ ఉన్నారు. టీ-కాఫీ తాగగానే ఒక సిగరెట్.. బాత్ రూమ్ కు పోవాలన్నా ఒక సిగరెట్.. భోజనం తర్వాత ఒక సిగరెట్.. సిగరెట్ తాగడమే ఒక పనిగా సిగరెట్.. ఇలా ఏదో ఒక కారణం చెప్పి.. ఎలాగోలా సిగరెట్ తాగేయాలని చూస్తూ ఉంటారు. షాపుల్లో కూడా చిన్న పిల్లలు వచ్చి అడిగినా కూడా సిగరెట్లను ఇచ్చేస్తూ ఉంటారు. అది ఎవరి కోసమో.. ఎందుకో కూడా అడగరు. 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్లే సిగరెట్లు తాగాలన్న నిబంధన భారత్ లో ఉన్నా కూడా.. ఆ నిబంధనలను పట్టించుకునే వాళ్లే లేరు. తాజాగా భారత ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నియంత్రించేందుకు.. కనీస వయసు 18 సంవత్సరాలను 21 సంవత్సరాలకు పెంచనుంది.  21 సంవత్సరాలు వచ్చిన తర్వాతే సిగరెట్ తాగడం.. పొగాకు ఉత్పత్తులను వినియోగించడం చేయాలి. దుకాణదారులకు కూడా 21 ఏళ్లు దాటిన వారికే సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను విక్రయించాల్సి ఉంటుంది. 2003లో తయారు చేసిన చట్టానికి కొన్ని మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సవరణలతో కొత్త చట్టాన్ని
తీసుకురాబోతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల్లును సిద్ధం చేసుకుంది.

Related Posts