YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

8 నెలల్లో 30 కోట్ల మంది టీకాలు

8 నెలల్లో 30 కోట్ల మంది టీకాలు

న్యూఢిల్లీ, జనవరి 9,
డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) దేశీయ కరోనా వ్యాక్సిన్లకు అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో. టీకా పంపిణీకి ఏ నిమిషంలోనైనా తలుపులు తెరిచే అవకాశం ఉంది. ఇప్పటికే టీకా సన్నద్ధతపై నమూనా పక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. రానున్న 8 నెలల్లో 30 కోట్ల మందికి టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకొంది. తొలివిడతలో ఫ్రంట్ లైన్లో సేవలందిస్తున్న సిబ్బందికి 3 కోట్ల టీకాలు పంపిణీ చేయనున్నారు. టీకా మొదటిగా ఎవరికి వేస్తారు.. ఎలా నమోదు చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకోవడం చాలాముఖ్యం.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న దాని ప్రకారం కరోనాపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న.. ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని దాదాపు కోటి మంది ఆరోగ్య సిబ్బంది, రెండు కోట్ల మంది మునిసిపల్‌, విపత్తు నిర్వహణ, జైళ్ల సిబ్బంది, సాయుధ దళాలు, పోలీసులు, హోంగార్డులు, సివిల్‌ డిఫెన్స్‌ ఆర్గనైజేషన్స్‌ సిబ్బంది, కట్టడి ప్రాంతాల్లో  రెవెన్యూ సిబ్బందికి ముందస్తుగా టీకా ఇస్తారు.
ఇకపోతే దేశంలోని మొత్తం వృద్ధుల సంఖ్య 30 కోట్లు. 50 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇచ్చేందుకు వీరిని రెండుగా విభజించారు. 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు ఒక విభాగం. 60ఏళ్లు పైబడిన వారు మరొక విభాగం. ఈ రెండు కేటగిరీలలోని వారి సంఖ్య 30 కోట్లు.  50ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నా.. ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న డయాబెటిస్‌, తక్కువ రోగ నిరోధక శక్తి, బీపీ వ్యాధిగ్రస్తులు కూడా ఈ 30కోట్ల మందిలో ఉన్నారు.కోవిన్‌వెబ్‌సైటులో నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ ఫొటో గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయాలి. లేదా ఓటీపీ, బయోమెట్రిక్స్‌, డెమోగ్రాఫిక్‌ విధానంలో ఆధార్‌నెంబరుతో అథెంటికేషన్‌ పొందాలి. నమోదు తర్వాత టీకా ఇచ్చే తేదీ, సమయం కేటాయిస్తారు. ముందుగా నమోదు చేసుకున్న వారికే టీకా అందుతుంది. టీకా కేంద్రాలను మూడుగా విభజించారు. ఫిక్స్‌డ్‌ సెషన్‌ సైట్‌ వైద్య పరికరాలు, డాక్టర్లు అందుబాటులో ఉండే ఆస్పత్రులు. ఔట్‌రీచ్‌ సెషన్‌ సైట్‌ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు. స్పెషల్‌ మొబైల్‌ టీమ్స్‌ రవాణా సదుపాయం లేని ప్రాంతాలు. అంతర్జాతీయ సరిహద్దులు వంటివి.
అయితే ప్రభుత్వం రూపొందించిన ఆ 30కోట్ల మందిలో లేని వారు 2022 వరకూ టీకా కోసం వేచిచూడక తప్పకపోవచ్చు. ఎందుకంటే.. ఫార్మసీలు వంటి బహిరంగ మార్కెట్లో టీకా అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. టీకా లభ్యతతోపాటు రోజువారీ వైద్య సేవలను పరిగణనలోకి తీసుకొంటే.. టీకా వేసే ప్రక్రియ అనుకున్నదానికంటే నిదానంగా జరగొచ్చు. 2017లో 32కోట్ల మంది చిన్నారులకు తట్టు నివారణ టీకా వేయడానికి నెల నుంచి రెండు నెలల సమయం పట్టడమే దీనికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే ఇప్పటి పరిస్థితి దృష్ట్యా.. నిర్ణీత సమయానికి నిర్దేశిత సంఖ్యకు టీకా అందడమనేది ముందున్న పెద్ద సవాలని చెప్పక తప్పదు.

Related Posts