YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

18 నుంచి ఇంటర్ క్లాసులు

18 నుంచి ఇంటర్ క్లాసులు

విజయవాడ, జనవరి  9, 
ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ కోర్టు పరిధిలోకి వెళ్లిందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అందుకే జీవో నెంబరు 23, వచ్చేవిద్యా సంవత్సరం నుంచి అమలు అవుతుందని, కోవిడ్ సంక్షోభం కారణంగా అడ్మిషన్లు ఆలస్యం అయ్యాయని అన్నారు. ఫస్ట్ ఇంటర్ అడ్మిషన్లు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం ఆన్ లైన్ అడ్మిషన్ నిర్ణయం తీసుకున్నామన్న ఆయన 50 శాతం మేర అడ్మిషన్లయ్యాక కొన్ని కార్పోరేట్ కళాశాలలు స్టేలు తెచ్చుకున్నాయని ఆయన అన్నారు.వచ్చే ఏడాది నుంచి ఆన్ లైన్ అడ్మిషన్లకు హై కోర్టు అనుమతి ఇచ్చిందని, ప్రస్తుతం ఆఫ్ లైన్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ అడ్మిషన్ల ప్రక్రియ 17 తేదీ వరకూ కొనసాగుతుందని 18 తేది నుంచి జూనియర్ కాలేజీల తరగతులు ప్రారంభవుతాయని ఆయన అన్నారు. ప్రాక్టికల్స్ కూడా ఈ విద్యా సంవత్సరంలోనే నిర్వహిస్తామన్న ఆయన 30 శాతం మేర సిలబస్ ను తగ్గించామని అన్నారు. ప్రైవేటు కళాశాలలు గత విద్యా సంవత్సరం ఫీజులో 30 శాతం తగ్గించి 70 శాతం ఫీజులు  మాత్రమే తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Related Posts