YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రజనీ మద్దతు కోసం... పార్టీలు

రజనీ మద్దతు  కోసం... పార్టీలు

చెన్నై, జనవరి 9 
రజనీకాంత్ పార్టీని పెట్టనని ప్రకటించారు. దీంతో తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఊపిరిపీల్చుకున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకేలు రజనీకాంత్ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఆయన ఆరోగ్యంతో ఉండాలని కోరుకంటున్నామని దాదాపు అన్ని పార్టీలు ప్రకటించాయి. రజనీకాంత్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంటుంది.అయితే ఇప్పుడు మరో కొత్త వ్యూహాలకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రజనీకాంత్ పార్టీ పెట్టకపోయినా ఆయన మద్దతు పొందాలన్నది ఇప్పడు రెండు పార్టీల ఆలోచన. రజనీకాంత్ పార్టీ పెడుతున్నానని ప్రకటించిన వెంటనే ఏ పార్టీ కూడా పెద్దగా స్పందించలేదు. డీఎంకే, అన్నాడీఎంకేలు కూడా సంయమనం పాటించాయి. రజనీకాంత్ పార్టీ పెడితే లాభం అన్నాడీఎంకేకే. ప్రభుత్వ వ్యతిరేక ఓటును రజనీకాంత్ చీల్చుకుంటే తాము లబ్ది పొందవచ్చని అన్నాడీఎంకే భావించింది.అదే సమయంలో రజనీకాంత్ పార్టీ పెడితే బాగా నష్టపోయేది డీఎంకేనే. అందుకే రజనీకాంత్ పార్టీ పెడతానని చెప్పగానే కొందరు డీఎంకే ద్వితీయ శ్రేణి నేతలు సోషల్ మీడియాలో రజనీకాంత్ కు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. అయితే స్టాలిన్ వారిని సంయమనం పాటించాలని కోరారు. ఇప్పుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించడంతో ఆయన మద్దతు కోసం అన్నాడీఎంకే, డీఎంకే ప్రయత్నిస్తున్నాయి.రజనీకాంత్ కు తమిళనాడు వ్యాప్తంగా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. గతంలోనూ రజనీకాంత్ ఒకసారి డీఎంకేకు మద్దతుగా నిలిచారు. అయితే ఈసారి రజనీకాంత్ ఎవరికి మద్దతిస్తారన్న చర్చ జోరుగా సాగుతుంది. రజనీకాంత్ ఆరోగ్యంపై పరామర్శ పేరుతో ఆయన వద్దకు వెళ్లాలని డీఎంకే, అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు. పరామర్శకు వెళ్లి తమకు మద్దతు తెలపాలని కోరనున్నాయి. మొత్తం మీద రజనీకాంత్ పార్టీ పెట్టకపోయినా ఆయన మద్దతు కోసం మాత్రం అన్ని పార్టీలూ పాకులాడుతున్నాయి. మరి రజనీకాంత్ మద్దతు ఎవరికి ఉంటుందనేది చూడాల్సి ఉంది.

Related Posts