YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పవన్..కమల్..కు పొలిటికల్ ఫ్యూచర్..?

పవన్..కమల్..కు పొలిటికల్ ఫ్యూచర్..?

హైదరాబాద్, జనవరి 9, 
పవర్ స్టార్ పవన్ కల్యాణ‌్ సినిమాలూ రాజకీయం కూడా అలా మెల్లగానే సాగుతున్నాయి. రీ ఎంట్రీ అంటూ సినిమాలు వరసగా మొదలుపెట్టిన పవన్ కల్యాణ‌్ వాటిని ఎపుడు పూర్తి చేస్తాడో చెప్పడం కష్టమే. ఈ మధ్యలో ఆయన రాజకీయ టూర్లు వేస్తూ తన గ్లామర్ ని, మేకోవర్ తో సహా జనం ముందు బయటపెట్టేసుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటే మొదట సంతోషించి అభినందించింది పవన్ కళ్యాణే. ఇపుడు ఆయన నో పాలిటిక్స్ అంటే నోట మాట రాక ఉన్నదీ ఇదే పవనే.భారతీయ సినీ నటులల్లో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవిలను మించిన స్టార్ డం వేరే వారికి ఉంటుంది అనుకోవడం ఒక అపోహ. అమితాబ్ ఇప్పటికి ముప్పయి అయిదేళ్ళ క్రితమే రాజకీయాలకు రాం రాం అన్నారు. ఆయన అలహాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున వన్ టైం ఎంపీగా మాత్రమే షార్ట్ టైమ్ పాలిటిక్స్ నడిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే సొంతంగా పార్టీ పెట్టి అది భారీ డిజాస్టర్ అయ్యాక దాన్ని కాంగ్రెస్ లో కలిపేసి కేంద్ర మంత్రిగా కొంతకాలం ప్రస్థానం సాగించి ఇపుడు హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు. రజనీకాంత్ విషయానికి వస్తే పార్టీ పెడతాను అంటూనే పాతికేళ్ళుగా ఊరించి చివరికి తుస్సుమనిపించారు.ముగ్గురు సూపర్ స్టార్ల అనుభవాలను జనం కళ్ళ ముందే చూశారు. ఎన్టీయార్, జయలలిత తరువాత సీఎం ల స్థాయికి ఎదిగిన స్టార్లు కూడా ఇప్పటిదాకా ఎవరూ లేరు. ఈ నేపధ్యంలో ఈ ముగ్గురు అనుభవాలు రేపటి రోజున చాలా మంది సినిమా స్టార్లకు కను విప్పు కావడమే కాదు, జనాలకు కూడా ఒక చక్కని అవగాహనను కలిగిస్తాయి. దాంతో ఇపుడు తమిళనాట కమల్ హాసన్ అయినా, తెలుగు నాట పవన్ కళ్యాణ్ అయినా వారి రాజకీయాల మీద ఈ స్టార్ల నీడ కచ్చితంగా పడుతుంది. ఈ ప్రభావం నుంచి ఈ ఇద్దరు సినిమా స్టార్లు తప్పించుకోవడం కూడా కష్టమే. సినిమా వాళ్ళు రాజకీయాలు సరిపోరు అన్న సందేశాన్ని ఆ ముగ్గురు సూపర్ స్టార్లు ఇచ్చేశాక ఇక మిగిలిన సినిమా వారి పరిస్థితిని కూడా జనం వారితో సరిపోల్చి చూడడం ఖాయం. దాంతో సినిమా తెర వేలుపులకు ఇక పైన రాజకీయాలు చేయడం కూడా కష్టమే అన్న విశ్లేషణలు ఉన్నాయి.ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇప్పటికే ఆయన తన సొంత సోదరుడు మెగాస్టార్ చిరంజీవి వల్ల రాజకీయంగా కొంత ఇబ్బంది పడుతున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం విఫల ప్రయోగం జనసేనను 2019 ఎన్నికల దాకా వెంటాడుతూనే ఉంది. ఇక తాజాగా రాజకీయాల గురించి చిరంజీవి చేసిన కామెంట్స్, ప్రదర్శించిన వైరాగ్యం కూడా పవన్ కల్యాణ‌్ కి ఎప్పటికీ మైనస్ గానే ఉంటాయి. దానికి తోడు తమిళనాట రజనీ అస్త్ర సన్యాసం, కమల్ హాసన్ గత ఎన్నికల పూర్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా పవన్ కి మరింత దెబ్బ తీసేవే అంటున్నారు. 2019 ఎన్నికల్లోనే పవన్ సత్తా చూసేశాక 2024లో ఆయన ప్రభావం కూడా పెద్దగా ఉండకపోవచ్చు అన్న చర్చలూ ఉన్నాయి. మొత్తానికి రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయితే అది పవన్ జనసేనకు కూడా బూస్టప్ అయ్యేది. కానీ చూస్తే సీన్ పూర్తిగా రివర్స్ అయింది. దాంతో జనసేన రాజకీయ ప్రస్థానం మీద కూడా అపుడే సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి, కొత్త డౌట్లూ పుడుతున్నాయి. చూడాలి మరి

Related Posts