YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

వృథానీటితో సాగుకు ప్రాణం

వృథానీటితో సాగుకు ప్రాణం

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఉన్నా పెద్దపల్లి జిల్లాలోని పెంచికల్ పేటతో పాటూ పరిశర గ్రామాలకు సాగునీటి సరఫరాలో సమస్యలు ఉండేవి. దీంతో స్థానిక వ్యవసాయక్షేత్రాలకు నీరు అందేది కాదు. దీంతో రైతులు రమారమి వెయ్యి ఎకరాల భూమిని సాగు చేయకుండా వదిలేశారు. నీరు అందితే ఈ భూమిలో సిరులు పండించవచ్చు. కానీ ప్రతికూల పరిస్థితులు సాగుపై తీవ్ర ప్రభావంచూపాయి. దీంతో స్థానిక రైతులు ఆవేదనభరితమయ్యేవారు. ఈ సమస్యను గుర్తించిన స్థానిక సింగరేణి యాజమాన్యం ఓ అద్భుతమైన ఆలోచన చేసింది. తమ గనుల్లో నుంచి వచ్చే వృథా నీటిని సాగు భూములకు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎత్తిపోతల పథకాన్ని కూడా ప్రారంభించింది. గనుల్లో నీరు వ్యవసాయక్షేత్రాలకు అందితే వ్యవసాయక్షేత్రాలకు ప్రయోజనకారిగా ఉంటుంది. స్థానికంగా పచ్చదనం పరచుకుంటుంది. అంతేకాక భూగర్భ జలాలు కూడా పెరగనున్నాయి. సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసే ఎత్తిపోతల పథకం ద్వారా 1160 ఎకరాలు సాగులోకి రానున్నాయి. పెంచికల్‌పేటతో పాటు అల్లూరు గ్రామానికి చెందిన పొలాలకు సాగునీరు అందుతుంది. 

పెంచికల్ పేటలో ప్రస్తుతం నీటి వనరులు లేక భూగర్భ నీటిమట్టం 12 నుంచి 18 మీటర్ల మేరకు పడిపోయింది. దీంతో బోర్లు వేసినా నీరందే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. సింగరేణి ఎత్తిపోతల పథకం ద్వారా పంట పొలాలకు నీరు అందితే పరిస్థితి మెరుగుపడొచ్చని చెప్తున్నారు. భూగర్భ జలాలు 6 నుంచి 8 మీటర్ల లోపే నీరు చేరే అవకాశం ఉందని అంటున్నారు. రైతుల సమస్యను గుర్తించే ఈ ఎత్తిపోతల పథకం ప్రారంభించినట్లు సింగరేణి యాజమాన్యం తెలిపింది. పరిసర గ్రామాల రైతులకు సాగునీరందించేందుకు తాము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పింది. ఈ ప్రోగ్రాంలో భాగంగానే సాగుకు ఊతమిచ్చేలా ప్రణాళికలు అమలుచేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ పనులను త్వరితగతిన పూర్తిచేసి చిరకాలంలోనే నీరు సరఫరా చేస్తామని సింగరేణి అధికారులు అంటున్నారు. ఈ పథకం ద్వారా అందించే నీటితో వ్యవసాయాభివృద్ధితో పాటు భూగర్భ జలాల పెంపునకు ఆస్కారం ఏర్పడనుందని స్పష్టంచేస్తున్నారు. ఎండిపోతున్న సాగుభూములను ఆదుకునేందుకు ముందుకొచ్చి, ఏకంగా ఎత్తిపోతల పథకాన్నే నిర్మిస్తున్న సింగరేణి యాజమాన్యాన్ని స్థానిక రైతాంగం ప్రశంసిస్తోంది.

Related Posts