YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు తెలంగాణ

పంట పొలాల్లో పట్టపగలు జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు - అంతకుడు అరెస్టు రిమాండ్... వివరాలు వెల్లడించిన షాద్ నగర్ ఏసిపి

పంట పొలాల్లో పట్టపగలు జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు - అంతకుడు అరెస్టు రిమాండ్... వివరాలు వెల్లడించిన షాద్ నగర్ ఏసిపి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలో ఇటీవల పంట పొలాలలో పట్టపగలు జరిగిన శ్రీనివాస్ రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు గల కారణాలను షాద్నగర్ ఏసిపి కుశల్కర్ వివరిస్తూ... హంతకుడు రాజేందర్ మధ్యప్రదేశ్ కు చెందిన వలస  కార్మికుడు. నందిగామ మండలం లో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కాంట్రాక్టర్ దగ్గర సెంట్రింగ్ మేస్త్రి గా విధులు నిర్వహిస్తున్నాడు.ఈ క్రమంలో నిత్యావసర కొనుగోలుకై శ్రీనివాస్ రెడ్డి పొలం మీదుగా మండల కేంద్రానికి వచ్చి తనకు అవసరమున్న నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసి తిరిగి శ్రీనివాస్ రెడ్డి పొలాల మీదుగా తన నివాసానికి వెళ్ళేవాడు.ఈ నేపథ్యంలో మృతుడు  శ్రీనివాస్ రెడ్డికి అంతకుడు రాజేందర్ కు తరచు గొడవ జరుగుతుండేది.ఈక్రమంలోనే మృతుడు శ్రీనివాస్ రెడ్డి హంతకుడు రాజేందర్ ను దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తిస్తూ చెయ్యి చేసుకోగా హంతకుడు రాజేందర్ కోపోద్రిక్తుడై తన చేతిలో ఉన్న గొడ్డలితో శ్రీనివాస్ రెడ్డి ని బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించినట్లు అంతకుడు అంగీకరించినట్లు ఏసిపి తెలియజేశారు.సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా హంతకుడిని గుర్తించి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని హంతకుడిని స్థానిక జడ్జి ముందు హాజరుపరచి తదనంతరం రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఇన్స్పెక్టర్ సిహెచ్ రామయ్య  ,ఎస్ ఐ ధనుంజయ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related Posts