YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

అగ్ని ప్రమాదం జరిగితే బాధ్యులెవరు... ఐక్య విద్యార్థి సంఘాలు

అగ్ని ప్రమాదం జరిగితే బాధ్యులెవరు... ఐక్య విద్యార్థి సంఘాలు

పట్టణంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రావుస్ కళాశాలలో ఫైర్ నిబంధనలు ఉల్లంఘించి యధేచ్చగా కళాశాల నిర్వహిస్తున్న యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మిగనూర్ పట్టణ ఫైర్ ఆఫీసర్ మోహన్ బాబు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి నాయకులురాజేష్ ఓంకార్ నరసన్న ఉదయ్ రాజీవ్ మహేంద్ర సురేష్ సురేంద్ర హుస్సైని ఖాజా కృష్ణ మాట్లాడుతూ పట్టణంలోని రావుస్ డిగ్రీ కళాశాల ఫైర్ నిబంధనలు ఉల్లంఘించి కళాశాలను  నిర్వహిస్తున్నారని ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితేదాదాపుగా 1700 మంది విద్యార్థుల ప్రాణాలకుఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు కళాశాలను కమర్షియల్ బిల్డింగ్ నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకుండా లాబ్స్ లోనూ పైన ఉన్న కమర్షియల్ భవనాలు లో ఎలాంటి నిబంధనలు లేకుండా నిర్వహిస్తోంది ల్యాబ్స్లో కనీస మౌలిక వసతులు లేక అగ్ని ప్రమాదం జరిగితే విద్యార్థులకు కనీసం ఫైర్ టెక్స్టింగ్ యూజెస్ కూడా లేకుండానిబంధనలు బేఖాతరు చేస్తున్నారని అగ్ని ప్రమాదం జరిగితే బయటికి వెళ్లడానికి మార్గం మరొకటి లేకపోగా ఉన్న ద్వారాన్ని చంచల్ గూడ జైల్ గేట్ల గా మార్చారని కళాశాలకు ముందుగా విద్యుత్ తీగలు అత్యంత ప్రమాదకరంగా ఉన్న కనీసం విద్యార్థుల సేఫ్టీ గాలికి వదిలేసి లాభార్జన ధ్యేయం గా సంవత్సరానికి సుమారు మూడు కోట్ల రూపాయలు ఆర్టీఎఫ్ రూపంలో ప్రభుత్వం ఇస్తున్న విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించక వారి ప్రాణాలకు ఎలాంటి భద్రత కల్పించలేని స్థితిలో ఉన్నది ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత వహించే ది ఎవరు అని అన్నారు తక్షణమే కళాశాలల పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని దశలవారీగా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు

Related Posts