YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం విదేశీయం

మూడు దశల్లో కరోనా వ్యాక్సినేషన్ లక్షా కోట్లపైగా ఖర్చు

మూడు దశల్లో కరోనా వ్యాక్సినేషన్ లక్షా కోట్లపైగా ఖర్చు

కరోనా వైరస్ కట్టడికి గాను ప్రభుత్వం చేపట్టే ఫేజ్‌‌1 వ్యాక్సినేషన్ ఖర్చు రూ.21 వేల కోట్ల నుంచి రూ.27 వేల కోట్ల వరకు అవుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. యావరేజ్‌గా రూ.25 వేల కోట్ల వరకు ఖర్చు ఉంటుందని అంచనావేసింది. ఫేజ్‌‌1లో భాగంగా ప్రభుత్వం 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వనుంది. అలాగే ఫేజ్‌‌ 2లో అదనంగా రూ.35 వేల కోట్ల నుంచి రూ.45 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలిపింది. ఈ ఫేజ్‌‌లో 50 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వనుంది. ఈ ఖర్చంతా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్(జీడీపీ)లో 0.3 శాతం నుంచి 0.4 శాతంగా ఉండనుందని ఎస్‌‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ చెప్పింది. 2021 ఆగస్ట్ నాటికి ప్రయార్టీ బేసిస్‌‌లో 30 కోట్ల మంది వ్యక్తులకు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2022 చివరి నాటికి 50 కోట్ల మంది ప్రైవేట్ వ్యక్తులకు వ్యాక్సిన్ వేయనుంది. ఒక్కో డోస్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ రూ.100 నుంచి రూ.150 వరకు అవుతుందని ఎస్‌‌బీఐ అంచనావేసింది. సిరమ్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్‌‌కు ప్రభుత్వానికి ఒక్కో డోస్‌‌కు రూ.250 నుంచి రూ.300 వరకు ఖర్చు అవుతుంది. సిరమ్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ 'కోవిషీల్డ్'ను ఎమర్జెన్సీ వాడకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అయితే ఒక్కో డోస్ కాస్ట్ రూ.100గా ఉండనుంది. ఈ వ్యాక్సిన్‌‌కు కూడా డ్రగ్ రెగ్యులేటర్స్ ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఇచ్చాయి. ఎస్‌‌బీఐ అంచనాల ప్రకారం 80 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలంటే ప్రభుత్వానికి రూ.56 వేల కోట్ల నుంచి రూ.72 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంది.ఫేజ్‌‌1 వ్యాక్సినేషన్ కోసం మూడు ప్రయార్టీ గ్రూప్‌‌లను ప్రభుత్వం గుర్తించింది. వారిలో కోటి మంది హెల్త్‌‌కేర్ వర్కర్లు, 2 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, 27 కోట్ల మంది పెద్ద వారు ఉన్నారు. పెద్ద వారిలో ఎక్కువ మంది 50 ఏళ్ల పైబడిన వారే. కరోనా వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం కో విన్(కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ వర్క్) పేరుతో ఓ అప్లికేషన్‌‌ను కూడా తీసుకొచ్చింది. కరోనా వ్యాక్సిన్‌‌ను దేశమంతా లాంచ్ చేయడం కోసం తీసుకొచ్చిన డిజిటైజ్డ్ ప్లాట్‌‌ఫామ్ ఇదని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. గురువారం వరకు కో విన్ సాఫ్ట్‌‌వేర్‌లో 78.62 లక్షల మంది హెల్త్‌‌కేర్ వర్కర్లు రిజిస్టర్ చేసుకున్నారు. చివరి నిమిషంలో ఏర్పడే సాంకేతిక సమస్యల నుంచి తప్పించుకునేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్‌‌ వేయించుకునే ప్రజల పేర్లను కో విన్ ప్లాట్‌‌ఫామ్‌‌లో నమోదు చేయాలని హెల్త్‌‌మినిస్ట్రీ కూడా సూచించింది. తొలి దశ ఇమ్యూనైజేషన్ డ్రైవ్ కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే రూ.480 కోట్లను విడుదల చేసింది. ఈ ఫండ్స్‌‌ను రాష్ట్రాలకు ఇవ్వనుంది.

Related Posts