కరోనా వైరస్ భయం ప్రజల్ని పట్టి పీడిస్తోంది. ప్రభుత్వం వ్యాధిపై ఎంతగానో అవగాహన కల్పిస్తున్న కొందరు మాత్రం ఇంకా భయంలోనే బతుకుతున్నారు. తాజాగా కరోనా భయంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడుతుంది. తనకు కూడా వ్యాధి సోకుతుందేమో అనే భయంతో మానసిక ఆందోళనకు గురైనన వాణి అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. . ఈ ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన రుబ్బ వాణి అనే యువతి, ఎస్బీఐ లో ప్రోబేషనరీ ఆఫీసర్ గా కరీంనగర్ లోని మంకమ్మతోట బ్రాంచిలో పని చేస్తోంది.అయితే ఆమె స్ధానిక టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో అద్దెకు ఉంటోంది. కరోనా వైరస్ సోకి గత నెలలో ఆమె తండ్రి మరణించారు. తల్లికి కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన వాణి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కరోనా భయం, తండ్రి మృతి తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్ లో పేర్కోంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభిచారు. మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. అయినప్పటికీ కూడా కొందరు వైరస్ భయంతో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.