YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

తమిళనాడులో రాజకీయ శూన్యత

తమిళనాడులో రాజకీయ శూన్యత

చెన్నై, జనవరి 11 
తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడ్డాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు. దీంతో అందరిచూపు కమల్ హాసన్ పైనే పడింది. కమల్ హాసన్ ఇప్పటికే మక్కల్ నీది మయ్యమ్ పార్టీని ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినా తగిన ఫలితం కన్పించలేదు. అయినా కమల్ హాసన్ అధైర్యపడలేదు. తమిళనాడులో రాజకీయ శూన్యత ఉందని భావిస్తున్న కమల్ హాసన్ మూడో ప్రత్యమ్నాయం వైపు దృష్టి పెట్టారు.అందరిలాగా కమల్ హాసన్ తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కానని ప్రకటించలేదు. అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రినని ఆయన ఇప్పటికే ప్రకటించారు. తమిళనాడులోని 234 శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి ఇప్పటికే ఇన్ ఛార్జులను నియమించారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు వ్యతిరేకంగా మూడో కూటమిని ఏర్పాటు చేయాలని కమల్ హాసన్ భావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే ఈ కూటమిలోకి ఎవరెవరు చేరతారన్న దానిపై కమల్ హాసన్ కసరత్తు చేస్తున్నారు.కమల్ హాసన్ ఇప్పటికే తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచార సభలకు అధిక సంఖ్యలో జనం హాజరవుతుండటంతో ఆయనలో ఉత్సాహం రెట్టింపవుతుంది. అధికారంలోకి వస్తే తాను ఏం చేయదలచుకున్నదీ తనకు స్పష్టత ఉందని చెప్పారు. ఇప్పటికే తాను మహిళలు, పేదల కోసం పలు పథకాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు కమల్ హాసన్ చెబుతున్నారు. తన పార్టీ అధికారంలోకి వస్తే మార్పు చూపిస్తానని కూడా కమల్ హాసన్ గట్టిగా హామీ ఇస్తున్నారు.దీంతో పాటు త్వరలో కమల్ హాసన్ రజనీకాంత్ తో సమావేశం అయ్యే అవకాశముంది. ఆయన రాజకీయ పార్టీ పెట్టకపోయినప్పటికీ తనకు మద్దతు ఇవ్వాలని రజనీకాంత్ ను కమల్ హాసన్ కోరాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ సినిమాల నుంచే స్నేహితులు కావడంతో తనకు ఈసారి ఎన్నికల్లో మద్దతును బహిరంగంగా ప్రకటించాలని కోరనున్నారు. దీంతో పాటు విజయ్ కాంత్ డీఎండీకే ను కూడా కూటమిలోకి తీసుకురావాలని కమల్ హాసన్ భావిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కమల్ హాసన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు.

Related Posts