YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అఖిల ప్రియ...ఒంటరి...

అఖిల ప్రియ...ఒంటరి...

కర్నూలు, జనవరి 11 
పాపం ఓ అఖిల ప్రియ. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ రాజకీయాలో పేరు పడిన వారు. శోభా నాగిరెడ్డి జగన్ పార్టీలో చేరి ఆయన కోసం ఎంతో శ్రమించారు. ఆమె 2014 ఎన్నికలకు ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్ను మూశారు. ఇక తండ్రి భూమా నాగిరెడ్డి కూడా తరువాత మూడేళ్లలో ఈ లోకాన్ని వీడారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఎంతో పేరు తెచ్చుకుని పులిలా బతికిన కుటుంబం భూమా నాగిరెడ్డిది. ఆయన ఆకస్మిక మరణంతో లక్ కలసి వచ్చి కూతురు అఖిల ప్రియ మంత్రి అయ్యారు. అప్పటికే వైసీపీ నుంచి తండ్రీ కూతుళ్ళు ఇద్దరూ టీడీపీని, చంద్రబాబుని నమ్ముకుని రూట్ మార్చారు.ఇక రాజకీయాల్లో నేను ఉన్నాను అన్న మాటల వెనక అర్ధాలను చాలా పరిమితంగా చూడాలి. నాడు జగన్ మీద కక్షతో బాబు భూమా కుటుంబాన్ని చేరదీశారు. ఇపుడు ఆ అవసరాలు లేవు, రాజకీయాలు లేవు. అందుకే బాబు గత ఏడాదిన్నరగా భూమా ఫ్యామిలీని పెద్దగా పట్టించుకోవడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే భూమా అఖిల ప్రియ ఇపుడు ఒక కిడ్నాప్ కేసులో ఇరుక్కుని జైలు ఊచలు లెక్కబెడుతోంది. ఏపీకి చెందిన ఒక అతి పెద్ద రాజకీయ కుటుంబానికి చెందిన మాజీ మంత్రి, మహిళ అయిన అఖిల ప్రియ ఇలా కటకటాల పాలు కావడం సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. అంతకు మించి టీడీపీ నుంచి ఒక్కరు కూడా ఆమెకు మద్దతుగా గొంతు సవరించకపోవడం కూడా చర్చగా ఉంది.రాజకీయాల్లో రాంగ్ స్టెప్ ఒక్కటి వేస్తే చాలు పాతాళం అంచులను చూపిస్తుంది. భూమా కుటుంబం ఆనాడు వైఎస్ ఫ్యామిలీతో బాగా అటాచ్ అయి ఉంది. జగన్ తోనూ వారు కలసి ప్రయాణించారు. మంచికో చెడుకో అనుకుని జగన్ తోనే నడచి ఉంటే భూమా కుటుంబం లో ఇలాంటి సీన్లు ఇపుడు వచ్చేవి కావు అన్న మాట కూడా ఉంది. భూమా నాగిరెడ్డి మరణానికి కారణం చంద్రబాబు మంత్రి పదవి ఆశ చూపి పక్కన పెట్టడం అని కూడా అంటారు. ఆయన మనో వేదనే చివరికి గుండె పోటు రూపంతో మింగేసింది. ఇక ఆయన కుమార్తె అఖిల ప్రియ సైతం చంద్రబాబు ఉన్నారనుకుని మంత్రిగా ఉన్న వేళ ఒక రేంజిలో హవా చాటారు. వైసీపీ మీద జగన్ మీద విరుచుకుపడ్డారు. సీన్ కట్ చేస్తే ఇపుడు జగన్ సీఎం అయ్యారు. భూమా కుటుంబం సొంత గడ్డ ఆళ్ళగడ్డలోనే ఓడి రాజకీయంగానూ ఓడుతోంది.అదే చంద్రబాబు మార్క్ రాజకీయం అంటారు. అవసరం ఉంటే ఆయనే ముందుకు వస్తారు. లేకపొతే తెరచాటునే ఉంటారు. ఇపుడు కిడ్నాప్ కధ జరిగింది, అఖిల ప్రియ అరెస్ట్ అయింది అంతా హైదరాబాద్ లో. కేసీయార్ ఇలాకా అది. అసలే కేసీయార్ పేరు ఎత్తడానికి బాబు సహా టీడీపీ నేతలు ఎవరూ సాహసించరు అన్నది విదితమే. దానికి తోడు పెద్దగా రాజకీయ అవసరం లేని అఖిల ప్రియ కోసం ఒక స్టేట్మెంట్ పడేయడం కూడా అవసరమా అన్న సీన్ పసుపు శిబిరంలో ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో అఖిల ప్రియ కష్టాలు చూస్తే బాధ కలగకమానదు. నేరం ఎవరు చేశారు వెనక ఎవరు ఉన్నారు ఇవన్నీ పక్కన పెడితే రాజకీయంగా బలమైన వాళ్ళు ఇంతకంటే ఎన్నో చేసి సులువుగా బయటకు వచ్చేసిన రోజులివి. మరి అఖిల ప్రియ చిన్న వయసులో మంత్రి అయింది. ఇపుడు ఇలాంటి చిక్కుల్లోనూ పడింది. ఆమెకు టీడీపీ నుంచి అండ దొరకడంలేదు అంటే అందులో అసక్తి ఉందేమో కానీ ఆశ్చర్యం మాత్రం లేదు. ఇది అంతే డర్టీ పాలిటిక్స్. 

Related Posts