YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యమునా నదిలో విషరసాయనాలు

యమునా నదిలో  విషరసాయనాలు

లక్నో, జనవరి 11 
రోజు రోజుకి కాలుష్యం ఎక్కువై పోతోంది. ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించడం, వాహనాలు పెరిగిపోవడం, ఫ్యాక్టరీ లో ఉండే వ్యర్ధ పదార్ధాలని నదుల్లోకి వదలడం… ఇలా అనేక కారణాల వల్ల కాలుష్యం బాగా పెరిగి పోతోంది. ఏది ఏమైనా వీటిని అదుపు చెయ్యాలి. లేదంటే ఎన్నో ప్రమాదాలు కలుగవచ్చు. అయితే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ లో యమునా నది కాలుష్య కాసారంగా మారింది. దీనితో పవిత్రమైన నదులు కూడా వ్యర్థ పదార్థాల తో నిండి పోతున్నాయి.కేవలం అక్కడే కాదు ఎక్కడ చూసుకున్నా ఇదే దుస్థితి ఏర్పడింది. ఇక అసలు విషయం లోకి వస్తే…. ఢిల్లీ నగరం లోని వివిధ పరిశ్రమల వ్యర్థాలను యమునా నది లోకే విడుదల చేయడంతో ఆ నది లోని నీరు మొత్తం కాలుష్యం అయిపోతోంది. ఇప్పటికే నది లోని నివసించే చేపలు మొదలు అనేక నీటి జీవులు మృత్యువాత పడుతున్నాయిఅలానే రోజూ నది లో చేరే అనేక రసాయన వ్యర్థాల వల్ల నీరు విషతుల్యంగా మారడం కూడా చూస్తున్నదే. ఇలా రోజు రోజు వ్యర్ధాలు ఎక్కువై పోతుండడం తో నీటి ఉపరితలం పై తెల్లటి విషపు నురగలు పేరుకు పోతున్నాయి. ఏది ఏమైనా ఈ రసాయన వ్యర్థాల వల్ల అనేక నష్టాలు ఉన్నాయి 

Related Posts