YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి ఆరోగ్యం తెలంగాణ

ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం ఖాళీలన్నీ ఒకేసారి భర్తీ : ఉన్నతాధికారులను సిఎం ఆదేశం

ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం ఖాళీలన్నీ ఒకేసారి భర్తీ : ఉన్నతాధికారులను సిఎం ఆదేశం

రాష్ట్రంలో  ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పలు కీలక అంశాలపై చ‌ర్చించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు  ప్రగ‌తి భ‌వ‌న్‌లో సోమవారం మంత్రులు, కలెక్టర్లు, పంచాయతీ రాజ్‌, రెవెన్యూ, మున్సిపల్‌, వైద్యారోగ్య, విద్యాశాఖ, మున్సిపల్‌ శాఖ, అటవీశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ప్రధానంగా విద్యాసంస్థల ప్రారంభంపై ఆ శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థల నిర్వహణ సాధ్యమేనని అధికారులు వెల్లడించడంతో సీఎం విద్యాసంస్థల పునః ప్రారంభానికి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. దీంతో 10 నెలలుగా మూతబడిన పాఠశాలలు మరో 20 రోజుల్లో తిరిగి తెరుచుకోనున్నాయి. ఉద్యోగ ఖాళీలన్నింటినీ ఒకేసారి వెంటనే భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించి అన్నిరకాల సమస్యలు సత్వరం పరిష్కరించాలని, ధరణి పోర్టల్‌లో అవసరమైన అన్నిరకాల మార్పులు చేర్పులు వారంరోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు. కరోనా టీకా పంపిణీకి వెంటనే ఏర్పాట్లు పూర్తిచేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు చెప్పారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తిచేసి వెంటనే అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు నిర్మించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అర్హులకు వెంటనే పదోన్నతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆయాశాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు.

Related Posts