భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఆ పార్టీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో కొన్నేళ్లుగా విభేదిస్తున్న యశ్వంత్ సిన్హా పార్టీ నుంచి బయటకొచ్చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ కేబినెట్ లో యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా మంత్రిగా ఉన్నారు. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు.గతంలో సిన్హా కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. గత కొంతకాలంగా భాజపా పట్ల అసంతృప్తిగా ఉన్న 80ఏళ్ల ఆయన ఈ రోజు బిహార్లోని పట్నాలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ భాజపాతో తన అనుబంధాన్ని తెంచుకుంటున్నట్టు వెల్లడించారు. అయితే తాను ఇక ఏ పార్టీలోనూ పనిచేయనని, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని అన్నారు. సిన్హా ఏర్పాటు చేసిన రాష్ట్ర మంచ్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్ నేతలతో పాటు మరో అసంతృప్త భాజపా నేత శత్రుఘ్న సిన్హా కూడా ఉన్నారు.
భాజపాకు వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసేందుకు యశ్వంత్ సిన్హా కొద్ది రోజుల క్రితం రాష్ట్ర మంచ్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ కేబినెట్ లో యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా మంత్రిగా ఉన్నారు. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు.శనివారం పాట్నాలో యశ్వంత్ సిన్హా ఏర్పాటు చేసిన సమావేశానికి పలువురు కాంగ్రెస్ నేతలు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దినేశ్ త్రివేది, ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్, జయంత్ చౌదరి, ఆప్కు చెందిన సంజయ్ సింగ్, సమాజ్ వాదీ పార్టీ నేత ఘనశ్యామ్ తివారీ తదితరులు హాజరయ్యారు.