YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మంచు మనోజ్ రాజీ ప్రయత్నం

మంచు మనోజ్ రాజీ ప్రయత్నం

హైదరాబాద్, జనవరి 12, 
మంచు మనోజ్ తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఎందుకు కలిశారు. హఫీజ్ పేట భూ వ్యవహారంలో రాజీ కోసం మంచు మనోజ్ తన వంతు సాయం భూమా కుటుంభానికి అందించే ప్రయత్నాలలో ఉన్నారా. ఈకేసు సమయంలో హఠాత్తుగా మంచు మనోజ్ కేటీఆర్ ను కలవడం ఇప్పుడి రాజకీయ,సినీవర్గాల్లో ఆసక్తి రేపుతుంది.హఫీజ్ పేట భూ వ్యవహారంలో కిడ్నప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యింది. మాజీ మంత్రి ఈ వ్యవహారంలో అరెస్ట్ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.కిడ్నప్ వ్యవహారంపై భూమా వారి వాదనలు వారు వినిపిస్తున్నారు.ఇటు భూ వ్యవహారంపై పెద్దలు మధ్యవర్తిత్వం వహిస్తే మాట్లాడడానికి తాను ముందుకు వస్తానని భూమా మౌనిక ప్రకటించింది.మరో వైపు భూమా కుటుంభంకు సన్నిహితంగా ఉండే మంచు మనోజ్ …మంత్రి కేటీఆర్ ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది.సీనియర్స్,యువత విషయంలో తన స్పోర్ట్స్,ఎడ్యుటైన్మెంట్ ప్రాజెక్టు విజన్ ను కేటీఆర్ తో మంచు మనోజ్ పంచుకున్నట్టు ట్విట్టర్లో ఉంది.తన ప్రాజెక్టు విషయంలో సానుకూలంగా స్పందించినందుకు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు మంచు మనోజ్ .మొత్తంగా కేటీఆర్ ను కలసి తన ప్రాజెక్టుపై చర్చించిన్నట్టు ట్విట్టర్లో కేటీఆర్ తో కలసిన ఫోటోను పోస్ట్ చేసారు మంచు మనోజ్. ఇటు మంచు మనోజ్ కేటీఆర్ ను కలవడం ఇప్పుడే ఎందుకు అన్న ప్రశ్నలు మొదలు అయ్యాయి.ఇబ్బందుల్లో ఉన్న భూమా ఫ్యామిలీకి అండగా …రాజీకి మంచు మనోజ్ ప్రయత్నాలు చేస్తున్నారా అన్న చర్చ హైదరాబాద్ సోషలైట్స్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేసు విచారణను సీరియస్ గా డీల్ చేస్తున్న పోలీసులు ఈ వ్యవహారంలో కీలకంగా భావిస్తున్న భార్గవ్ రాం కోసం వేట కొనసాగిస్తున్నారు.మరి నిజంగానే హఫీజ్ పేట భూ వ్యవహారంలో మంచు మనోజ్ తన వంతు సాయం భూమా కుటుంభంకు అందించేందుకు ముందుకు వచ్చారా …అందులో నిజం ఉందా… లేదా అన్నది తేలాల్సిన అంశంగా కనిపిస్తుంది .మొత్తానికి ఈ వ్యవహారం ముందు ముందు ఎటువంటి మలుపులు తిరుగుతోందన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.
అఖిలకు బిగిస్తున్న ఉచ్చు :
బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ ప్రధాన నిందితురాలు అని తేల్చేశారు పోలీసులు. మొత్తం ప్లాన్ చేయడం నుండి దానిని అమలు పరిచే దాకా ఆమె అన్ని విషయాల్లోనూ ఇన్ వాల్వ్ అయినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన దానికి సంబంధించి పూర్తీ వివరాలు వెల్లడించారు. ఈ కిడ్నాప్ కోసం వీరు ఆరు సిమ్ లు కొనుగోలు చేసినట్టు పోలీసులు ఆధారాలతో వెల్లడించారు.అలానే కిడ్నాప్ కేసులో మరో ముగురు నిందితులను అరెస్ట్ చేశామని టాస్క్ ఫోర్స్  పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. వారిలో ఒకరు మల్లికార్జున్ రెడ్డి కాగా మరొకరు బోయా సంపత్ కుమార్ (22) ఈయన భూమా అఖిల ప్రియ పర్సనల్ అస్సిటెంట్ అని, అలానే అఖిల ప్రియ డ్రైవర్ బాల చెన్నయ్య అనే వ్యక్తుల్ని అరెస్ట్ చేశామని అంజనీ కుమార్ పేర్కొన్నారు. మూడు మొబైల్ ఫోన్స్ , ఫేక్ నెంబర్ ప్లేట్స్ స్వాధీనం చేసున్నామని ఆయన పేర్కొన్నారు.

Related Posts