YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అంగ‌రంగ వైభ‌వంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - అల‌వైకుంఠ‌పురంలో వ‌న్ ఇయ‌ర్ రీయూనియ‌న్ ఈవెంట్

అంగ‌రంగ వైభ‌వంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - అల‌వైకుంఠ‌పురంలో వ‌న్ ఇయ‌ర్ రీయూనియ‌న్ ఈవెంట్

అల వైకుంఠపురంలో చిత్రం 2020, జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. అల్లు అర్జున్ కెరీర్ లో ఈ మూవీ ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిచింది. త్రివిక్రమ్ పదునైన డైలాగ్స్, తమన్ బాణీలు, అల్లు అరవింద్, చినబాబు నిర్మాణ విలువలు ఇలా అన్నీ ఈ సినిమాను ఒక బ్లాక్ బాస్టర్ సినిమాగా నిలబెట్టాయి. ఈ సినిమా విడుదలై ఏడాదైన సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, అల్లు అరవింద్, పూజా హెగ్డే,  త్రివిక్రమ్, సుశాంత్, సునీల్, నవదీప్, సముద్రఖని తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ... అల వైకుంఠపురంలో సినిమా నా కెరీర్ లో ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిచిందంటే అందుకు కారణమైన అందరికి ధన్యవాదాలు. త్రివిక్రమ్ గారి టేకింగ్ తమన్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. నాన్న, చినబాబు గారు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. 2020 నాకు బెస్ట్ ఇయర్, అలా వైకుంఠపురంలో సినిమా విడుదలై నాకు బూస్టప్ ఇచ్చింది. నా కెరీర్ లో ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. నా 20 ఏళ్ల కెరీర్ లో ఈ సినిమా గుర్తుండిపోయింది. ఈ సినిమాను అందరూ ప్రేమతో చేశారు. కెమెరామెన్ వినోద్, నవీన్ నోలి, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ... రెండేళ్ల కిందట నేను బన్నీ సినిమా చేద్దాం అనుకోని స్టార్ట్ చేశాం, అలా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. బన్నీ వాసు గారు, అల్లు బాబీ గారికి ఈ సినిమా నరేట్ చేసినప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ మర్చిపోలేను. అల్లు అరవింద్ గారు కథ విని వెంటనే షూటింగ్ కి వెళ్లిపోండి అన్నారు, ఇప్పటికీ ఆ మాట అతని కాన్ఫిడెన్స్ మర్చిపోలేను చినబాబు గారు కథకు ఏం కావాలో అన్నీ సమకూర్చారు. సునీల్ ఉంటే చాలని చెప్పాను అలాగే తమన్ ప్రాణం పెట్టి సాంగ్స్ ఇచ్చాడు. పూజా హెగ్డే ఎనర్జీ ఇలా అందరూ తమవంతు పూర్తి సహకారం ఇచ్చారు. ఈ సినిమాను మీడియా తమ సొంత సినిమాగా భావించి ఎంకరేజ్ చేశారు. అల వైకుంఠపురంలో సినిమా ఇంత గ్రాండ్ హిట్ అయిందంటే అందుకు అల్లు అర్జున్ ప్రధాన కారణమని చెబుతాను. బన్నీ ఈ సినిమాకు ఎంత చెయ్యగలడో అంతా చేశాడు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ టెక్నీషియన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ... ఒక ఏడాది తరువాత అల వైకుంఠపురంలో సినిమా ఫంక్షన్ ఏంటని అడిగారు. మా సినిమా విడుదలైన ఏడాది తరువాత కూడా మేము ఈవెంట్ చేస్తున్నాము అంటే ఈ సినిమాలో అంత దమ్ము ఉంది. ఈ సినిమా త్రివిక్రమ్ మాయ, బన్నీ విశ్వరూపం, తమన్ కు జస్ట్ బిగినింగ్. ఈ కోవిడ్ సమయంలో అల వైకుంఠపురంలో సినిమా అందరికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. త్రివిక్రమ్ రైటింగ్ లో మ్యాజిక్ అందరికి నాలుగు రెట్లు ఎక్కువ  ఉత్సాహన్నీ ఇచ్చింది. జెమినిలో ఈ సినిమా బెస్ట్ టిఆర్పీ 29.4 రేటింగ్ ను సొంతం చేసుకుంది. థియేటర్ అనేది తల్లి లాంటిది, ఓటిటి అనేది పిల్లలతో సమానం. కలకాలం నిలిచిపోయేది థియేటర్స్ మాత్రమేనని తెలిపారు.
తమన్ మాట్లాడుతూ... అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమా నుండి నాకు బెస్ట్ సపోర్ట్ ఇస్తున్నారు. తనతో వర్క్ చెయ్యడం చాలా హ్యాపీగా ఉంది. అలా వైకుంఠపురంలో నాకు మోస్ట్ మెమరబుల్ సినిమా. అల్లు అరవింద్ గారు, చినబాబు గారు, వంశీ గారు ఈ సినిమాకు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. వారు నాకిచ్చిన కాన్ఫిడెన్స్ మరిచిపోలేను. బన్నీ గారిమీద ప్రేమతో ఒక స్పెషల్ సాంగ్ చేశాము, అందుకు సహకరించిన అందరికి ధన్యవాదాలు. త్రివిక్రమ్ గారితో నేను ఎప్పుడు ఒక ప్రోగ్రామర్ గానే వర్క్ చేశాను. అతని డైలాగ్స్ లో మోర్ మీనింగ్ ఉంటుంది. ఈ సినిమాకు వర్క్ చేసిన అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
పూజ హెగ్డే మాట్లాడుతూ... అల వైకుంఠపురంలో సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతివక్కరికి థాంక్స్. బన్నీ గారి ఎనర్జీ ఈ సినిమాకు మెయిన్ హైలెట్. ఈ సినిమా చేస్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేశాను. నిర్మాతలు అల్లు అరవింద్, వంశీ, చినబాబు గారి సపోర్ట్ సూపర్బ్. త్రివిక్రమ్ గారితో చేసున్న రెండో సినిమా ఇది. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీపీయన్స్ మర్చిపోలేను. ఈ సినిమాను అన్నీ ప్లాట్ఫామ్స్ లో ఆదరించిన ఆడియన్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.
సుశాంత్ మాట్లాడుతూ... అల వైకుంఠపురంలో ఈవెంట్ కు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా నాకు చాలా ఉత్సాహం ఇచ్చింది. నేను ఎక్కడికి వెళ్లినా ఈ సినిమాలోని సాంగ్స్ వినిపిస్తున్నాయి. బన్నీతో కలిసి నటించడం నాకు బెస్ట్ మెమోరీస్. నాకు ఈ సినిమాలో భాగం చేసిన నిర్మాతలు అల్లు అరవింద్ గారికి, చినబాబు గారికి త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాలోన్న నవదీప్, సునీల్, సముద్రఖని అల వైకుంఠపురంలో సినిమాను ఆడియన్స్ ఎంకరేజ్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్ తెలిపారు. ఒక మంచి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉందని ఈ అవకాశం కల్పించిన నిర్మాతలు అల్లు అరవింద్, చినబాబు, వంశీ గర్లకు అలాగే త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు. అల్లు అర్జున్ అలా వైకుంఠపురం లాంటి మరిన్ని బ్లాక్ బాస్టర్స్  సినిమాల్లో నటించాలని తెలిపారు. 

Related Posts