తెలుగు స్టార్ హీరో రానా ఇటీవల ''సౌత్ బే'' పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. ఈ ఛానెల్ ద్వారా సెలబ్రిటీల ఇంటర్వ్యూస్ తో పాటు వర్తమాన విషయాలపై తన అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అతి తక్కువ టైమ్ లో ''సౌత్ బే'' వ్యూయర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. వ్యూయర్స్ లో ఉన్న ఈ క్రేజ్ నేపథ్యంలో వరల్డ్ లీడింగ్ డిజిటల్ మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ''బిలీవ్'', ''సౌత్ బే'' తో ఎక్స్ క్లూజివ్ మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ చేసుకుంది. 1400 ఉద్యోగులతో ''బిలీవ్'' కంపెనీ 45 దేశాల్లో తమ సేవలను అందిస్తోంది.
ఈ ఒప్పందం నేపథ్యంలో హీరో రానా మాట్లాడుతూ....''మా సౌత్ బే కు ఎక్స్ క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వామిగా ఉండేందుకు బిలీవ్ ఇండియా ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. సౌత్ బే ప్రారంభించినప్పటి నుంచి ఇలాంటి వరల్డ్ క్లాస్ పార్టనర్ కోసం ఎదురుచూశాం. బిలీవ్ ఇండియాతో డిస్ట్రిబ్యూషన్ ఒప్పందం వల్ల సౌత్ బే మరింతగా వ్యూయర్స్ కు రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం. ప్రతిభ గల కొత్త కళాకారులకు అవకాశాలు ఇవ్వడం, కమర్షియల్ కంటెంట్ తయారుచేయడం వంటి వాటిపై దృష్టి పెట్టబోతున్నాం.'' అన్నారు.
బిలీవ్ ఇండియా డైరెక్టర్ కెజివి కిరణ్ కుమార్ మాట్లాడుతూ..''టాలెంట్ ఉన్న కొత్త కళాకారులను, మ్యూజిక్ లేబుల్స్ ను ప్రోత్సహించడం బిలీవ్ ఇండియా కార్యాచరణలో కీలకమైంది. సౌత్ బే తో ఎక్స్ క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందం చేసుకోవడం కూడా ఇందులో భాగమే. ఇలాంటి భాగస్వామ్యాలతో సంగీత ప్రపంచంలో కొత్త దారిని ఏర్పర్చగలమని నమ్ముతున్నాం.'' అన్నారు.