YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఆలయ దోషులను జగన్ బయటపెట్టాలి

ఆలయ దోషులను జగన్ బయటపెట్టాలి

విజయవాడ జనవరి 12, 
హైందవమతంపై దాడిచేస్తున్నా వారెవరో తనకు తెలుసుని ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి,  డీజీపీ ఆయనకు తక్షణమే నోటీసులిచ్చి, జగన్ నుంచి సమాచారం రాబట్టాలని డిమాండ్ చేస్తున్నామని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. నెల్లూరుసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేవాలయాలపై దాడులుచేస్తున్నవారే తిరిగి వాటిని సందర్శిస్తున్నారని, రథాలను తగలబెడుతున్నవారే రథయాత్రలుచేస్తున్నారని అన్నారు.  ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బట్టిచూస్తే, ఎవరు హైందవమతంపై దాడిచేస్తున్నారో, ఎవరు రథాలను తగలబెట్టారో ఆయనకు తెలుసునని స్పష్టమవుతోంది.  దోషులెవరో ముఖ్యమంత్రికి తెలుసునని, ఆయనే చెప్పాడు కాబట్టి, డీజీపీ తక్షణమే జగన్మోహన్ రెడ్డికి 91సీఆర్ పీసీ చట్టంప్రకారం నోటీసులు ఇవ్వాలి.  దేవాలయాలపై దాడులుచేస్తున్నవారి గురించి, రథాలను తగలబెడుతున్నవారి గురించి తనకు తెలుసునన్న  ముఖ్యమంత్రి, ఆ సమాచారాన్ని సిట్ కు తెలియచేయాలి.  డీజీపీ కూడా ముఖ్యమంత్రినుంచి సమాచారం రాబట్టి, దోషులను పట్టుకొని, రాష్ట్రంలో హైందవమతంపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. అన్నీ తనకు తెలుసునని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి మతాలమధ్య చిచ్చుకు శ్రీకారం చుడుతున్నాడని అర్థమవుతోంది. ఎన్నికల కమిషనర్ ఒక వ్యవస్థకుప్రతినిధి, అటువంటి వ్యక్తిని ఉద్దేశించి కోవర్టు అనడం జగన్ కు సరికాదు.  ఆయన తక్షణమే తప్పు ఒప్పుకొని, రాష్ట్ర ఎస్ఈసీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.   జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం తమస్వార్థంకోసం, వారి రాజకీయప్రయోజనాలకోసం క్రైస్తవమతాన్నిరోడ్డునపడేశారన్న చంద్రబాబు వ్యాఖ్యల్లో తప్పేముందో, క్రైస్తవ మతపెద్దలు ఆలోచించాలని విజ్ఞప్తిచేస్తున్నాను.   క్రైస్తవ మతంకోసం పనిచేస్తున్న పేదపాస్టర్లకుఅందాల్సిన రూ.5వేల భృతిని జగన్, తనకు అనుకూలంగా పనిచేసే వ్యక్తులకు ఇవ్వడాన్నే చంద్రబాబు తప్పుపట్టారని తెలుసుకోండి.  జగన్ మాయలోపడి, ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయవద్దని వారిని కోరుతున్నాను. జగన్ అనే వ్యక్తి విజయమ్మ, రాజశేఖర్ రెడ్డిల బిడ్డ మాత్రమే అనేనిజాన్ని క్రైస్తవ మతపెద్దలు గ్రహించాలి.   ముఖ్యమంత్రి తనబాధ్యతల నిర్వహణలో  తడబడుతూ, తప్పటడుగులు వేస్తున్నాడు కాబట్టే, వ్యక్తులను తప్పుపడుతూ, వారిపైకి వ్యవస్థలను రెచ్చగొడుతున్నాడు. డీజీపీ ముఖ్యమంత్రికి నోటీసులిచ్చి, ఆయన నుంచి సమాచారం రాబట్టకపోతే, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనకున్న సూత్రధారులను పట్టుకోవడంపై సవాంగ్ కు  చిత్తశుద్ధి లేదని తాము భావించాల్సి ఉంటుందని వఅయన అన్నారు. 

Related Posts