విజయవాడ జనవరి 12,
‘‘జాతీయ యువజన దినోత్సవం’’ సందర్భంగా యువతకు శుభాకాంక్షలు. స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. స్వామి వివేకానంద కలలుగన్న సమాజం ఆవిష్కరణే మన యువత లక్ష్యం కావాలి. వివేకానందుడు చూపిన బాటలో యువతరం నడవాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజాభివృద్దికి పునాదిరాళ్లు యువతరమే..ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి భారతదేశ సొంతం. మన యువతరం శక్తి సంపదలు అపారం. తెలివితేటల్లో, వినూత్న ఆవిష్కరణలలో ఎవరికీ తీసిపోరు. టిడిపి ప్రభుత్వ హయాంలో యువత నైపుణ్యాల అభివృద్దికి విశేష ప్రాధాన్యం. ఉమ్మడి ఏపిలో, విభజన తర్వాత యువతరం శక్తిసామర్ధ్యాలు పెంచేందుకే ప్రాధాన్యం. వందలాది ఇంజనీరింగ్ కళాశాలల స్థాపన ద్వారా యువజన సాధికారత. ఐటి రంగం అభివృద్దితో దేశవిదేశాల్లో తెలుగుయువత ప్రతిభకు పెద్దపీట వేసారు. 13జిల్లాల ఏపిలో రూ16లక్షల కోట్ల పెట్టుబడులతో 30లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి. ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా, ఉపాధి కల్పనా కేంద్రంగా ఏపిని చేశాం. 5ఏళ్లలో దాదాపు రూ10లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టాం, 10లక్షల ఉద్యోగాలు కల్పించాం. అలాంటిది గత 19నెలలుగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకార మయం అయ్యింది. అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచారు. అభివృద్ది శూన్యం, అధ: పాతాళానికి రాష్ట్రాన్ని తెచ్చారు. టిడిపి తెచ్చిన పెట్టుబడులు, కంపెనీలు అన్నింటినీ తరిమేశారు. యువజన సంక్షేమ పథకాలను రద్దు చేశారు. యువత స్వయం ఉపాధి అవకాశాలకు గండికొట్టారు. యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని అయన అన్నారు. గవర్నమెంట్ టెర్రరిజంతో అన్నివర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వేలాది యువతీయువకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపారు. సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. వందలాది ప్రార్ధనా మందిరాలపై దాడులు, విధ్వంసాలు 67ఏళ్ల రాష్ట్ర చరిత్రలో లేవు. ఇటువంటి కక్ష సాధింపు పాలన, హింసాత్మక చర్యలు మున్నెన్నడూ చూడలేదు. బిసి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటిలపై ఇలాంటి దమనకాండ ఏ రాష్ట్రంలోనూ లేదు. చట్టసభలు, పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగ సంస్థలు, మీడియాపై దాడి చేస్తున్నారు. ఈ దుస్థితిలో రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరమే తీసుకోవాలి. మీ కాళ్లపై మీరు నిలబడటమే కాకుండా సమాజాన్ని చైతన్యపరిచే బాధ్యత భుజాన వేసుకోవాలి. పాలకుల దుశ్చర్యలపై అన్నివర్గాల ప్రజలను చైతన్యపరచాలి. హింసా విధ్వంసాలు, కక్ష సాధింపు చర్యలు లేని సమాజాన్ని ఆవిష్కరించాల్సింది యువతరమే. మీరు స్వయం శక్తి సంపన్నులు కావడంతోపాటు, రాష్ట్రాభివృద్దికి, భావితరాల ప్రగతికి దోహదపడాలి. వివేకానందుడి మార్గదర్శకంలో మీరంతా నడవాలి. ‘‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం’’ ఉన్న యువతగా మీరంతా రూపొందాలి. అన్ని రంగాల్లో మనదేశాన్ని, రాష్ట్రాన్ని ముందంజ వేయించాలని చంద్రబాబు అన్నారు.