YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కాశీకి వెళ్లినప్పుడు తనకు ఇష్టమైన ఏదైనా పదార్థం వదిలివేయడానికి కారణమేమిటి ?

కాశీకి వెళ్లినప్పుడు తనకు ఇష్టమైన ఏదైనా పదార్థం వదిలివేయడానికి కారణమేమిటి ?

మన ఈ శరీరాలు, ఇంద్రియాలు, అవయవాలు, బుద్ధి, మనసు, ఇలా అన్నీ అ పరమాత్మ ఇచ్చినవే. భగవంతుడు ఇచ్చిన వానితో ఆయన సేవనే చేయాలి. మన నాలుకతో స్వామి నామకీర్తన చేయాలి. మనసుతో ధ్యానం, చేతులతో భగవంతునికి పూజ చేయాలి. చెవులతో ఆయన కథలనే వినాలి. కన్నులు ఆ స్వామిని, స్వామి భక్తులనే చూడాలి. కాళ్లు దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు ,యాత్రలకు ,భక్తుల ఇళ్లకు వెళ్లాలి. నాసిక స్వామి పాదాలపై ఉంచిన తులసిని వాసన చూడాలి. మన మాట్లాడే ప్రతి నాలుగు మాటలలో ఒక మాట భగవాడ్ని గురించి కావాలి. ఇలా చేస్తే సంసారంలో ఉన్నా సన్యాసంలో ఉన్నా ఒకటే! కానీ కన్ను, ముక్కు, చెవులు, నాలుకకు ప్రకృతిలో లభించేవే సకల భోగాలకు ఇష్టంగ మారిపోయాయి . మన ఇష్టాల కోసం భగవంతుని వదులుకుంటున్నాం. ఇలా చేస్తే మన ఇష్టాలన్నీ కష్టాలనే కలిగిస్తాయి. బాగా తింటే అజీర్ణం, బాగా అనుభవిస్తే రోగాలు ,అంటువ్యాధులు,అనేక శారీరక ఇబ్బందులు కలుగుతాయి. భగవంతుని వదిలి ఇష్టాలను పట్టుకుని కష్టాల పాలుకాకుండా భగవంతుని కోసం మన శరీరానికిష్టమయ్యే వాటిని వదిలితే మనసు, బుద్ధి, శరీరం ప్రసన్నంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా ఒక్కసారే అన్నీ వదలటం కష్టం కాబట్టి ఒక్కొక్క క్షేత్రంలో ఇష్టాన్ని విడుస్తూపోతే కోరికలు తగ్గుతాయి. ఇష్టం కోసం భగవంతుని విడిస్తే సంసారం.. భ‌గ‌వంతుడి కోసం ఇష్టాన్ని విడిస్తే ప్రసన్నత, సంతృప్తి, సంతోషం, లభిస్తాయి!
అందుకే కాశీలో కొన్ని, గయలో కొన్ని, ప్రయాగలో కొన్ని, గంగలో కొన్ని ఇలా విడుచుకుంటూపోతే చివరికి ఆశ లేకుండా పోతుంది. ఇదీ ఇందులోని అంతరార్థం. కోరికలకు దాసుడివి కాకు ! 

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts