విజయవాడ జనవరి 13,
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడ లో బస చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయకు సీఎం జగన్ పుష్పగుచ్చం అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.అంతకు ముందు.. దత్తాత్రేయను డీజీపీ గౌతమ్ సవాంగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. సుమారు 20 నిమిషాల పాటు ఆయనతో సమావేశం అయ్యారు. బండారు దత్తాత్రేయను ఏపీ డీజీసీ మర్యాదపూరకంగా కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారి మధ్య కొన్ని కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇదివరకు వరుసగా కొనసాగిన విగ్రహాల విధ్వంసం దేవాలయాలపై దాడుల అంశం ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ బీజేపీ జనసేన విమర్శలు చేశారు. తమనిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయడానికి బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు రథయాత్రను నిర్వహిస్తారనే ప్రచారం సాగుతోంది.ఈ పరిణామాల మధ్య హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ రాష్ట్ర పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆ తర్వాత డీజీపీని హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ సత్కరించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను బండారు దత్తాత్రేయ మంగళవారం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.