YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాళేశ్వరం పనులపై మంత్రి హరీష్ రావు సమీక్ష వానాకాలానికి అన్ని పనులు పూర్తి కావాలి

కాళేశ్వరం పనులపై మంత్రి హరీష్ రావు సమీక్ష     వానాకాలానికి అన్ని పనులు పూర్తి కావాలి

కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన 6,7, 8 ప్యాకేజీల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. 37 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలన్న సంకల్పంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును వచ్చే వానాకాలం నాటికి  ఆరునూరైనా పూర్తి చేయవలసిందేనని ఇరిగేషన్ అధికారులు, ఏజన్సీల ప్రతినిధులను ఆదేశించారు. నిర్మాణ రంగ చరిత్రలోనే  కాళేశ్వరం పలు అద్భుతాలు సృష్టిస్తున్నదని ఆయన గుర్తు చేశారు.ప్యాకేజీ 7 పనుల తీరు పట్ల మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు.మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌజ్, అన్నారం బ్యారేజీ పనులు ఊపందుకున్నాయని తెలిపారు. అదే స్పీడ్ లో మిగతా ప్యాకేజీలలో పనులు జరగాలని హరీష్ రావు కోరారు. గత  నాలుగు నెలల్లో పనుల పురోగతిలో  గణనీయమైన మారపు కన్పిస్తున్నదని అన్నారు.అదే ఉత్సాహాన్ని అన్ని ప్యాకేజీల్లోనూ చూపాలని కోరారు.ప్యాకేజి 7 లో లైనింగ్ పనుల వేగం పెరగాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు.లైనింగ్ పనులు ఎత్తి పరిస్థితుల్లోనూ జూలై కల్లా పూర్తి చేయాలని సూచించారు.అధికారుల మధ్య సమన్వయం, కార్మికులు, ఇంజనీర్లు, యంత్ర పరికరాల సంఖ్య పెంచడంతో పనుల్లో వేగం కూడా పెరిగిందన్నారు.త్వరలో తాను ప్యాకేజి 7 ను సందర్శిస్తానని మంత్రి తెలిపారు.6 , 8 ప్యాకేజీలలోని పంపులను జూన్ కల్లా సిద్ధం చేయాలని హరీష్ రావు ఆదేశించారు.మేడిగడ్డ, అన్నారం,సుందిళ్ళ బ్యారేజీల గేట్ల నిర్మానపనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బ్యారేజీలు, పంపు హౌజ్ లకు అవసరమైన విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం, టవార్ల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని హరీశ్ రావు కోరారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైనందుకు  ఏజెన్సీలు, ఇరిగేషన్ ఇంజనీర్లు, సిబ్బంది ప్రతి ఒక్కరు గర్వపడాలని మంత్రి అభిప్రాయపడ్డారు. పట్టుదల, వేగంతో పనులు కొనసాగించాలని సూచించారు. 

Related Posts