అమరావతి జనవరి, 13
తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు.. గాలిపటాల సందళ్ళు, పైరుపచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, మన ప్రత్యేకమైన కళలకు ఈ సంక్రాంతి పండగ ప్రతీక అన్నారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడి దేశచరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కనీవినీ ఎరుగుని విధంగా గత 19 నెలలుగా మన రైతన్న సంక్షేమానికి, మన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామన్నారు. ఇక మీదటా ఇదే విధానం కొనసాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆశించారు