హైదరాబాద్ జనవరి, 13
అఖిల ప్రియ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినిమా తరహాలో కిడ్నాప్ కు అఖిల ప్రియ అండ్ గ్యాంగ్ ప్లాన్ చేసింది. ఘటనకు ముందు అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26 అనే సినిమాని భార్గవ్ సోదరుడు చంద్రహాస్ చూపెట్టినట్లు సమాచారం. ఐటి అధికారులు గా ఎలా నటించాలి అనే దానిపై వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. యూసుఫ్ గూడా లోని ఎంజీఎం స్కూల్ లో కిడ్నాప్ పై చంద్రహాస్ శిక్షణ ఇచ్చినట్లు తెలిసింది. అఖిల ప్రియ ఆదేశాల కు అనుగుణంగానే అక్షయ్ కుమార్ సినిమా చూపెట్టి భార్గవ్, చంద్రహాస్ కిడ్నాప్ చేయించారు. ఐటి అధికారుల చెకింగ్ డ్రెస్సులు ఐడి కార్డలను చంద్రాస్ రూపొందించాడు. శ్రీ నగర్ కాలనీలో నీ ఒక సినిమా కంపెనీ నుంచి ఐటి అధికారుల డ్రెస్లను కిడ్నాపర్లు అద్దెకు తీసుకున్నట్లు తేలినట్లు సమాచారం