YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

జనవరి చివరి నుంచి....సినిమాలు క్యూ

 జనవరి చివరి నుంచి....సినిమాలు క్యూ

హైదరాబాద్, జనవరి 13, 
సంక్రాంతికి మూడు భారీ సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి.   అందులో క్రాక్ జనవరి 9న వచ్చి కిరాక్ పుట్టిస్తున్న‌ది. కలెక్షన్స్ వస్తాయా రావా.. కరోనా భయంతో ఆడియన్స్ థియేటర్ వరకు వస్తారా రారా అనే అనుమానాలను తెరదించేస్తూ క్రాక్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో మాస్టర్ జనవరి 13న.. రెడ్, అల్లుడు అదుర్స్ జనవరి 14న విడుదల అవుతున్నాయి. ఈ జోరు సంక్రాంతితోనే ఆగిపోవడం లేదు.   జనవరి చివరి వారం నుంచి మొదలు పెట్టి సమ్మర్ వరకు కంటిన్యూగా సినిమాలు క్యూలో ఉన్నాయి. మరి అవేంటో చూద్దాం..
బంగారు బుల్లోడు: అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా జనవరి 23న విడుదల కానుంది.
30 రోజుల్లో ప్రేమించడం ఎలా: యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రం జనవరి 29న విడుదల తేదీ కన్ఫర్మ్ చేసుకుంది.
జాంబి రెడ్డి: అ.. కల్కి సినిమాల తర్వాత ప్రశాంత్ వర్మ చేస్తున్న సినిమా జాంబి రెడ్డి. కరోనా వైరస్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 5న థియేటర్స్‌లోకి రానుంది.
ఏ1 ఎక్స్‌ప్రెస్: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తరహాలో సందీప్ కిషన్ చేస్తున్న సినిమా ఏ1 ఎక్స్‌ప్రెస్. హాకీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్ కానుంది.
ఉప్పెన: వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన ఫిబ్రవరి చివరి వారంలో ఆడియన్స్ ముందుకు రానుంది.
రంగ్ దే: గతేడాది భీష్మతో హిట్ కొట్టిన నితిన్.. ఈ ఏడాది మార్చ్ 26న రంగ్ దే అంటూ వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దీనికి దర్శకుడు.
టక్ జగదీష్: నాని హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ టక్ జగదీష్. ఈ సినిమా ఎప్రిల్ 12న విడుదల కానుంది.

Related Posts