విజయవాడ, జనవరి 15,
ఛాన్స్ పోతే రాదు. వచ్చిన ఛాన్స్ ని వదులుకుంటే అమాయకత్వం అవుతుంది. అదే ప్లాన్ తో ఉంది బీజేపీ. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దేవాలయాలపై దాడులను వీలైనంత హైలైట్ చేయాలని చూస్తోంది. కేవలం లోకల్ లీడర్లే కాదు.. నేషనల్ లీడర్లు కూడా ఏపీలో వాలిపోయే ప్లాన్ చేస్తున్నారు.. బీజేపీ స్టేట్ లీడర్లు.ఏపీలో దేవాలయాలపై దాడుల విషయం ఎంత హైలైట్ అవుతుందో చూస్తూనే ఉన్నాం కదా. హీట్ ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతున్నట్లు అనిపిస్తోంది. అందుకే.. మళ్లోసారి హైప్ ఇవ్వాలని చూస్తున్నారు బీజేపీ లీడర్లు. రామ రథ యాత్ర పేరుతో.. ఈ నెల చివరిలోగా రథయాత్ర మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.. బీజేపీ ఏపీ లీడర్లు. రామతీర్థం నుంచి కపిల తీర్థం వరకు ఈ రథయాత్ర ఉండనుంది. రామ తీర్థం ఇటు చివరన విజయనగరం జిల్లాలో ఉంది.. కపిల తీర్థం అటు చివరన చిత్తూరు జిల్లాలో ఉంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు రథ యాత్ర చేస్తే.. ఆల్మోస్ట్ ఏపీ మొత్తం కవర్ అవుతుంది. అలాగే పేర్లు కూడా కలిసొచ్చాయి. రామ తీర్థం టు కపిల తీర్థం. అందుకే..ఇలా ప్లాన్ చేస్తున్నారు బీజేపీ లీడర్లు. రామతీర్థం నుంచి కపిల తీర్థం వరకు.. ఏ ఏ ఆలయాలపై దాడులు జరిగాయో అన్ని ఆలయాలను సందర్శించనుంది ఈ రథయాత్ర.ఆల్రెడీ బీజేపీ సౌత్ పై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే కదా. తెలంగాణలో ఎలాగూ మంచి స్వింగులో ఉంది. అందుకే.. వెంటనే తెలుగు రాష్ట్రమైన ఏపీ పై కూడా ఫోకస్ చేసింది. విగ్రహాల ధ్వంసం బీజేపీకి కలిసొచ్చే అంశం అయింది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు కూడా ఎక్కడా తగ్గడం లేదు. బండి సంజయ్ బండేసుకుని తిరుగుతుంటే.. మేం రథం వేసుకుని తిరుగుతాం అంటున్నారు. ఈ రథయాత్ర ఎఫెక్ట్ తిరుపతి బై పోల్ పై కూడా ఉండే ఛాన్స్ అయితే బానే కనిపిస్తోంది. ఈనెల 17న వైజాగ్ లో బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ జరగనుంది. ఈ మీట్ లో రథ యాత్ర, ఏర్పాట్లు రూట్ మ్యాప్ పై చర్చించనున్నారు. ఏదెలా ఉన్నా.. సెంట్రల్ లీడర్లని దించాలి.. బీజేపీకి ఏపీలో బూస్ట్ ఇవ్వాలి.. రథ యాత్రతో హిందూవాదాన్ని నిద్రలేపి.. ఆలయాల ఇష్యూని ఇంకాస్త హైలైట్ చేసి.. వీలైనంత బెన్ ఫిట్ పొందాలి అని చూస్తోంది ఏపీ బీజేపీ.