కరోనా టీకా పంపిణీ కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో అధికారులు ఏర్పాట్లు చేశారు.రేపు 16 న తేదీన తొలి విడత వ్యాక్సిన్ అందించనున్నారు.ఇప్పటికే వ్యాక్సిన్ జిల్లా కేంద్రాలకు చేరింది.నిజామాబాద్ జిల్లాలో 6 కేంద్రాల ద్వారా ఒక్కో కేంద్రం లో 30 మందికి టీకా వేయనున్నారు. కామారెడ్డి జిల్లాలో 4 చోట్ల వ్యాక్సిన్ వేయనున్నారు.ఒక్కే సెంటర్ లో 50 మందికి టీకా వేస్తారు. ఈరోజు సాయంత్రం లోగా వ్యాక్సిన్ ను ప్రత్యేక వాహనాల్లో పంపిణీ కేంద్రాలకు తరలిస్తారు.ప్రతి సెంటర్ వద్ద ఒక అంబులెన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ను అందుబాటులో ఉంచనున్నారు.డివిజన్ ల వారీగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.