కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇకపై అధిక సమయం పార్టీ కార్యాలయంలో నాయకులకు, ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ అందుబాటులో ఉంటారని, పార్టీ కార్యక్రమాలను ఆయన సమీక్షిస్తారని ఆ పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ జనతా బజార్‌ను నిర్వహిస్తారని ఆ నాయకుడు పేర్కొన్నారు.