శనివారం ఉదయం 10.30కు కోవిడ్ వ్యాక్సినేషన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. 139 సెంటర్లలో తెలంగాణ లో వాక్సినేషన్ కార్యక్రమం వుంటుందని రాష్ట్ర డీఎంఈ రమేష్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ రెండు వాక్సినేషన్ సెంటర్లలో లైవ్ ఇంట్రాక్షన్ ఉంటుంది. గాంధీ, నార్సింగ్ ఆస్పత్రుల్లో మోడీ ఇంట్రాక్షన్ ఉంటుందని అయన అన్నారు.
వాక్సిన్ 18 ఏళ్లలోపు ఉన్నవాళ్లకు వాక్సిన్ ఇవ్వరు. గర్భిణీ లకు, పాలిచ్చే తల్లులకు వాక్సిన్ ఇవ్వరు. హిమో ఫిలియా ఉన్న వాళ్లకు కూడా వాక్సిన్ ఇవ్వరు. వాక్సిన్ రెండు దోసులు..మొదటి డోస్ తర్వాత 28 రోజులకు మరో డోస్ ఇస్తాం. వాక్సిన్ వల్ల కొందరికి రియాక్షన్లు సాధారణంగా రావొచ్చు. రియాక్షన్ల కు ట్రీట్మెంట్ కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అయన అన్నారు.