YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

దీదీకి అండగా శివసేన

దీదీకి అండగా శివసేన

వసేన ఇప్పుడు బీజేపీని అడ్డుకునే ప్రయత్నం అడుగడుగునా చేయాలని నిర్ణయించింది. బీజేపీ ఓటమి ప్రధాన లక్ష్యంగా శివసేన పనిచేస్తుంది. మహారాష్ట్రలో తమ కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేందుకు బీజేపీ అడుగడుగునా ప్రయత్నిస్తుండటం శివసేనకు చికాకు తెప్పిస్తుంది. తమ ప్రభుత్వాన్ని కూల్చే లక్ష్యంగానే బీజేపీ ఇప్పటికీ పావులు

కదుపుతుండటాన్ని శివసేన తట్టుకోలేకపోతుంది. అందుకే ఏ మాత్రం అవకాశం ఉన్నా ఎక్కడైనా బీజేపీ విజయాన్ని అడ్డుకోవాలని శివసేన భావిస్తుంది.వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మొన్నటి వరకూ పశ్చిమ బెంగాల్ లో పోటీ చేయాలా? వద్దా? అన్న దానిపై ఎటూ తేల్చుకోలేని శివసేన తాజాగా నిర్ణయం తీసుకుంది. బెంగాల్ లో

పోటీ చేయాలని నిర్ణయించింది. దాదాపు వంద స్థానాల్లో పోటీ చేసేందుకు శివసేన సిద్ధమవుతుంది. తద్వారా బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలన్నది శివసేన వ్యూహంగా కన్పిస్తుంది. బీజేపీ అనుసరిస్తున్న ఫార్ములానే శివసేన అనుసరించాలని డిసైడ్ అయిందిబీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం ద్వారా ముస్లిం ఓటు బ్యాంకు ను ఆర్జేడీకి దూరం

చేయగలిగింది. ఫలితంగా ఆర్జేడీ తృటిలో అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు అదే తరహాలో బీజేపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టేందుకు శివసేన రంగంలోకి దిగాలని నిర్ణయించింది. ఇప్పటికే బీజేపీ మమత బెనర్జీని ఇబ్బంది పెడుతుంది. టీఎంసీలో ఉన్న నేతలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పార్టీలో చేర్చుకుంటుంది. అలాగే బీజేపీలో ప్రాధాన్యత దక్కని నేతలను

శివసేనలో చేర్చుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది.
శివసేన నేతలు ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో పోటీ పై ఒక నిర్ణయానికి వచ్చారు. బర్రాక్ పూర్, బంకుర, విష్ణుపూర్, డుండుం, మిడ్నాపూర్, సౌత్ 24 పరగటణ, హుగ్లీ, కోల్ కత్తా, ఝూర్గావ్ ప్రాంతాల్లో శివసేన పోటీ చేసే అవకాశాలున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకునేందుకు ఉద్ధవ్ థాక్రే త్వరలో పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్నారు.

మొత్తం మీద శివసేన బీజేపీని దెబ్బతీసేందుకే బెంగాల్ లో పోటీకి దిగాలని నిర్ణయించింది. అయితే ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఎన్నికల తర్వాతనే తేలనుంది.

Related Posts