YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం దేశీయం

చికెన్ మార్కెట్..డీలా

చికెన్ మార్కెట్..డీలా

ప్రాణాంతకమైన బర్డ్ ఫ్లూ వైరస్ రోజురోజుకూ దేశంలో విస్తరిస్తున్న నేపధ్యంలో కోట్లాది రూపాయల విలువ చేసే మాంస పరిశ్రమపై అనిశ్చితి దోబూచులాడుతోంది. ఆసియాలోని అతిపెద్ద చికెన్ మండీ అయిన ఢిల్లీలోని ఘాజీపూర్ చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. బర్డ్ ఫ్లూ వ్యాప్తితో ఈ అతిపెద్ద మండీ సైతం మూడురోజులుగా మూతపడింది. కాగ జాతీయ

రాజధానిలో పౌల్ట్రీ సంబంధిత వ్యాపారాలన్నింటిపై పది రోజుల పాటు ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించడం తెలిసిందే.ప్రభుత్వం కోళ్ల వ్యాపారంపై నిషేధం ప్రకటించడంతో ఘజియాపూర్ చేపలు, కోళ్ల మార్కెట్ వెలవెలబోతోంది. రోజువారీ వ్యాపారం సాగకపోవడంతో ఉసూరుమంటూ షాపుల సమీపంలో కూర్చున్ని ఉన్న వ్యాపారులు ఇలాంటి ఉత్పాతాన్ని తాము

ఎన్నడూ చూడలేదన్నారు. గతంలో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందినప్పుడు కూడా ఇలా పరిశ్రమపైనే ఎన్నడూ నిషేధం పెట్టలేదని వారు వాపోయారు.బర్డ్ ఫ్లూ గురించి మాకు పెద్దగా తెలీదు కానీ, మేం ప్రతిరోజూ అత్యంత నైపుణ్యంతో జాగ్రత్తతో మా పనిచేస్తూ ఉంటాం. కోళ్లఫారాలు మాకు ధ్రువపర్చిన కన్‌సైన్‌మెంట్‌నే పంపుతుంటారు. దాన్ని ఘాజీపూర్ మండీలో

డాక్టర్ తనిఖీ చేస్తారు. పైగా కస్టమర్లు కూడా మండిలో కొనేముందు ధ్రువపత్రం చూపమని అడుగుతారు అని మండిలోని వ్యాపారి మహమ్మద్ ఇఫ్తికర్ చెప్పారు.ప్రతిరోజూ ఘాజీపూర్ మండీలో కోట్లరూపాయల విలువైన వ్యావారం జరుగుతుంటుంది. వేలాది మంది కూలీలు ఇక్కడ 24 గంటలూ పనిచేస్తూంటారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ తరహా

నిషేధం విధిస్తారేమోనని భీతిల్లిన కూలీలూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు.అయితే ప్రభుత్వం విధించిన 10 రోజుల బ్యాన్ తర్వాత మా కార్యకలాపాలను పునరుద్ధరించుకోగలమని నమ్ముతున్నాం. అయితే మరో లౌక్ డౌన్ భయంతో వందలాది కూలీలు వెళ్లిపోవడంతో మండీని తెరిచినా బిజినెస్ మునుపటిలో పుంజుకోవడానకి చాలా సమయం పడుతుందని మరోక

స్థానిక వ్యాపారి చాంద్ మహమ్మద్ చెప్పాడు. ఏవైరస్ వచ్చినా సరే సాధారణ కూలీల బతుకుపైనే వేటుపడుతుందని ఘాజీపూర్ మండి నిషేధ ఉదంతం కూడా తేటతెల్లం చేస్తోంది.
 

Related Posts