YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

జిల్లాల టూర్ లోకి కేసీఆర్

జిల్లాల టూర్ లోకి కేసీఆర్

సీఎం కేసీఆర్ లో ఇన్ని మార్పులా.. పొలిటిక‌ల్ లీడ‌ర్లు న‌మ్మేలా లేదు. ఈ వ‌య‌సులో ఇన్ని క‌ష్టాలు ఎలా ప‌డుతున్నారు సీఎం కేసీఆర్. జ‌నం అంటే ఎంత ప్రేమ అనుకోవాల్సిన ప‌నేం లేదంట‌. అంతా భ‌యం భ‌యం అంటున్నారు పొలిటిక‌ల్ అన‌లిస్టులు. ఇన్నాళ్లూ ఏ మాత్రం లెక్క చేయ‌కుండా ఉన్న సీఎం కేసీఆర్ కి.. ఆయ‌న టీఆర్ఎస్ పార్టీకి వ‌ణుకు మొద‌లైంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ పాలిటిక్స్ లో ఈ మాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. కేవ‌లం ప్ర‌త్య‌ర్థులే కాదు.. సొంత పార్టీ నేత‌లు కూడా సెటైర్లు వేస్తున్నార‌ట‌. యాక్చువ‌ల్ గా అయితే.. సీఎం కేసీఆర్ అంటే తెలంగాణ‌లో ఓ వ‌ణుకు ఉంది. పాయింట్ టూ పాయింట్ మాట్లాడ‌క‌పోతే పంచులు త‌ప్ప‌వు. ఇక యాక్ష‌న్ విష‌యంలోనూ అంతే.

సైలెంట్ గా ఉంటారు.. క‌రెక్ట్ టైంకి రెస్పాండ్ అవుతారు. అలాగ‌ని.. లేట్ కూడా చేయ‌రు.. ఇమీడియ‌ట్ రియాక్ష‌న్ ఉంటుంది అనే టాకుంది. కానీ.. ఇప్పుడేం జ‌రుగుతోంది. అంతా రివ‌ర్స్ అవుతోంది. ఉరుకులు ప‌రుగులు పెడుతున్నారు సీఎం కేసీఆర్.. ఎక్క‌డ‌లేని నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ప‌డ‌క‌న‌ప‌డ్డ ఫైళ్లు క‌దిలిస్తున్నారు. జ‌నం గుర్తొస్తున్నారు. జ‌నం బాట గుర్తొస్తోంది. దారిప‌డుతున్నారు. అమ్మో అమ్మో.. ఏంటి సార్ ఇది అంటూ.. జ‌నం అంతా నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. మా సీఎం కేసీఆర్ సార్ కి ప్ర‌గ‌తి భ‌వ‌న్, ఫామ్ హౌజ్ కాకుండా ప్ర‌జ‌ల క‌ష్టాలు, వాళ్ల ఆశ‌లు ఎట్టా గుర్తొస్తున్నాయ‌బ్బా.. జింగ్ జింగ్ ఇది అమేజింగ్ క‌దబ్బా అంటున్నారు.


అందుకే.. ఇప్పుడు సీఎం కేసీఆర్ మామూలు ప్లాన్స్ తో లేరు.. ద్విముఖ వ్యూహాలు.. త్రిముఖ వ్యూహాలు అంటున్నారు. దీనిపైనా కామెంట్స్ త‌ప్ప‌డం లేదు. ద్విముఖ వ్యూహం అంటేనేమో.. కేటీఆర్, కేసీఆర్ అట‌.. త్రిముఖ వ్యూహం అంటేనేమో.. కేసీఆర్, కేటీఆర్ క‌విత అట‌. ఇలా ఎన్నో సెటైర్లు వినిపిస్తున్న‌య్. ఏదెట్టా ఉన్నా.. ముందుగా ద్విముఖ వ్యూహంపై ఫుల్లుగానే ఫోక‌స్ చేశార‌ట సీఎం కేసీఆర్.
అంటే.. అటు పార్టీతో పాటు.. ఇటు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనా యాక్ష‌న్ ప్లాన్ అట‌. ముందుగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు.. అదే టైంలో.. ప్ర‌జ‌ల్లోకి పార్టీని ఇంకా తీసుకెళ్లి వీక్ అయిన చోట బ‌ల‌ప‌ర‌చ‌డం ఇంపార్టెంట్. ఈనెలాఖ‌రులోగా పీఆర్సీ ఇస్తార‌ట‌. వెంట‌నే నామినేటెడ్ ప‌ద‌వులు భ‌ర్తీ చేస్తార‌ట‌. అంద‌రినీ క‌లుస్తార‌ట సీఎం కేసీఆర్. అందుకే.. జిల్లాల‌ల్లో కూడా ప‌ర్య‌టిస్తార‌ట‌.

ఏద‌న్నా చెప్పుర్రి మీరు.. బండి సంజ‌య్ బండి దూకుడు ఏదైతే ఉందో.. దాని వ‌ల్ల కార్ స్పీడ్ పెరిగింది. అదే స్పీడ్ తో అదే కారు.. జిల్లాల్లోకి కూడా వ‌స్తుంది అంటే.. మామూలు మాట‌లా చెప్పండి

Related Posts