YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏకాభిప్రాయానికి వచ్చిన సీపీఎం

ఏకాభిప్రాయానికి వచ్చిన సీపీఎం

సూదీర్ఘ చర్చల అనంతరం రాజకీయ తీర్మాణ ముసాయిదాపై సీపీఎంలో ఏకాభిప్రాయం కుదిరింది. పార్టీ ప్రయోజనాలు, ఐక్యత ద్రుష్టా ప్రకాశ్ కారత్, సీతారం ఏచూరి వర్గాలు ఒక్కొ మెట్టుదిగాయి. త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, కెరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ జోక్యంతో ఇరు వర్గాల మద్య రాజీ కుదిరింది. కాంగ్రెస్ తో ఏలాంటి రాజకీయ పొత్తులు పెట్టుకోకుండానే...మతతత్వాన్ని అడ్డుకునేందుకు, ప్రజా ఉద్యమాల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేసేలా రాజకీయ పంథా ను  రూపొందించారు.చర్చోప చర్చలు, వాదనలు, ప్రతివాదనలు, సవరణలు, సమాధానాల అనంతరం ఎట్టకెలకు సీపీఎం రాజకీయ తీర్మాణ ముసాయిదాపై నేతలు ఏకాభిప్రయానికి రాగలిగారు. కాంగ్రెస్ తో పార్టీ వైఖరి ఏలా ఉండాలన్న దానిపై పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ లు ప్రవేశ పెట్టిన భిన్న ముసాయిదాలపై మూడు రోజుల పాటు చర్చలు సాగాయి. 47 మంది ప్రతినిధులు చర్చలో పాల్గోనగా 373 సవరణలొచ్చాయి. అయితే రాష్టాల వారిగా ప్రతినిధులు రెండు అభిప్రాయాల నడుమ చీలిపోవడంతో పరిస్థితి ఓటింగ్  వరకు వెల్లింది. కాంగ్రెస్ తో రాజకీయ అవగాహన ఉండాలన్న ఏచూరికి బెంగాల్, తమిళ నాడు, మహరాష్ట, ఓడిషా, బీహర్ తో పాటు మరికొన్ని రాష్టాలు మద్దతు తెలిపాయి. అయితే కాంగ్రెస్ తో ఏలాంటి సంబంధాలు ఉండోన్న కారత్ ప్రతిపాదనకు కెరళ, ఏపీ, తెలంగాణ, త్రిపుర ప్రతినిధులు మద్దతు పలికారు. ఏచూరి, ప్రకాశ్ కారత్ వర్గాలు తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు చివరి వరకు ప్రయత్నించాయి. పార్టీని విభజించొద్దని ఏచూరి భావోద్వేగ ప్రసంగం చేసారు. ఒకా నోక దశలో రహస్య ఓటింగ్ నిర్వహించాలని ఏచూరి వర్గం పట్టుబట్టింది. అయితే పార్టీ కార్యక్రమంలో కేవలం బహిరంగ ఓటింగే ఉండటంతో సమస్య మరితం జఠిలమైంది. అయితే రెండు బిన్న ముసాయిదాల నడుమ నెలకొన్న ప్రతిష్టంబన ఎంతకు తెగకపోవడంతో పార్టీ చిలిపోతుందా అన్న అనుమానాలు వెలువడ్డాయి. దీంతో పార్టీలో ఐకమత్యాన్ని కాపాడేందుకు కెరళ సీఎం పినరాయ్ విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ రంగంలోకి దిగారు. పార్టీ ప్రయెజనాల పరిరక్షనే ప్రథాన కర్తవ్యమని..రెండు వర్గాల మద్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేసారు. పొలిట్ బ్యురో సభ్యులతో సంప్రదింపులు జరిపి కారత్ ప్రవేశ పెట్టిన కేంద్ర కమిటీ రాజకీయ ముసాయిదాలో పలు సవరణలను ప్రతిపాదించారు. బీజేపీని ఓడించేందుకు లౌకిక ప్రజా తంత్ర శక్తులను ఏకం చేయడమే అత్యంత ప్రధానం. "అయితే కాంగ్రెస్ పార్టీతో అవగాహన గానీ, ఎన్నికల పొత్తులుగాని పెట్టుకోకుండానే ఇది జరగాలి" అన్న దాన్ని " కాంగ్రెస్ పార్టీతో రాజకీయ పొత్తులు పెట్టుకోకుండానే ఇది జరగాలి"  అని సవరించారు. అంటే సీతారం ఏచూరి ప్రతిపాదించినట్లుగా..కాంగ్రెస్ తో రాజకీయ అవగాహన పెట్టుకొవచ్చనే వెసులు బాటును కల్పించారు. అయితే ఈ అవగాహన ఎక్కడి వరకు ఉండాలన్నదానిని కూడా నిర్దేశించారు. పార్లమెంటు లోపల కాంగ్రెస్ తో సహ ఇతర లౌకిక శక్తుల మద్య అంశాల వారిగా అవగాహన ఉండొచ్చు. పార్లమెంటు వెలుపల మతోన్మదానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడంలో విపక్షాలకు సహకారం అందించాలి. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ తో సహ ఇతర బుర్జువా పార్టీలతో ఐక్య ఉద్యమాలను ప్రొత్సహించాలి అని రాజకీయ పంథాను నిర్దేశించుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు లేకుండా...మతోన్మాదాన్ని అడ్డుకోవడంలో, ప్రజా సమస్యలపై పోరాడేందుకు కాంగ్రెస్ తో కలిసి పనిచేయవచ్చనే అంశంపై ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో మూడు రోజుల చర్చల అనంతరం పార్టీ రాజకీయ తీర్మాణ ముసాయిదాను సభ ఆమోదించింది. ఇది ఏచూరి లైన్ కు దగ్గరగా ఉండటంతో సీతారం ఏచూరి మరో సారి కార్యదర్శిగా ఎన్నిక కావడం లాంఛనమే అంటున్నారు. శనివారం నాడు పార్టీ నిర్మాణం పై చర్చ జరిగిన తర్వాత నూతన కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుల ఎంపిక ఉండనుంది. ఆదివారం నాడు సరూర్ నగర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభతో సీపీఎం 22వ జాతీయ మహసభలు ముగుస్తాయి.

Related Posts