పట్టణంలో ఉన్న ప్రైవేట్,కార్పొరేట్ జూనియర్ కళాశాలలైనా నారాయణ,దీక్ష, వైష్ణవి,నలంద,సివి రామన్ వంటి జూనియర్ కళాశాలల 2020-21 అడ్మిషన్ల పేరుతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను నిలువు దోపిడీ చేస్తున్నారని కాబట్టే ఈ కళాశాలల గుర్తింపును రద్దు చేసి, యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా సహాయ కార్యదర్శి విజయేంద్ర, తాలూకా అధ్యక్షుడు సమీ వుల్లా, ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2020 విద్యాసంవత్సరంలో కరోనా తో కష్టాలతో విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఎమ్మిగనూర్ పట్టణం లో ఉన్న ప్రైవేటు జూనియర్ కళాశాలలు కరోనా కష్టాలను క్యాష్ చేసుకోవడానికి ఇంటర్ అడ్మిషన్లు ఆసరగా చేసుకుని జనవరి నుంచి ఏప్రిల్ వరకు బోధించడానికి,విరుద్ధంగా కేవలం 3 నెలలకు గాను నారాయణ కళాశాల,25000 నుంచి 35000 వరకు
ప్రైవేట్ కళాశాలలు 10000 నుంచి 15000 అక్రమంగా వసూలు చేస్తూ ఆర్థిక దోపిడీకి తెర తీస్తున్నారని, దీంతో విద్యా వ్యాపారాన్ని అంగడి సరుకుగా విక్రయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇంటర్ బోర్డ్ సంబంధిత అధికారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికంగా ఫీజులు వసూలు చేస్తే అలాంటి కళాశాలలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని బేఖాతర్ చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని, పట్టణంలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల పై ఇంటర్మీడియట్ బోర్డు అధికారి రామకృష్ణ గారికి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేయడం జరుగుతుందని, తక్షణమే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేయాలని, అధిక ఫీజులు వసూలు చేసిన విద్యార్థుల దగ్గర్నుంచి తీసుకున్న ఫీజులను తక్షణమే వాపసు ఇవ్వాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ఐఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.