YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 29 ఆసు పత్రులలో కోవిడ్ వ్యాక్సినే షన్ ప్రారంభం - కోవిడ్ వ్యాక్సినేషన్ కు జిల్లా యంత్రాంగం సన్న ద్ధం: ఇంచార్జి కలెక్టర్

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 29 ఆసు పత్రులలో కోవిడ్ వ్యాక్సినే షన్ ప్రారంభం - కోవిడ్ వ్యాక్సినేషన్ కు జిల్లా యంత్రాంగం సన్న ద్ధం: ఇంచార్జి కలెక్టర్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈనెల 16న మొద టి విడతలో హెల్త్ కేర్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సి నేషన్ కు  జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నదని ఇం చార్జి కలెక్టర్ డి. మార్కండే యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు..

ఈనెల 16 న ఉదయం 10:30 గంటలకు గౌ. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు,గౌ. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కోవిడ్ వాక్సినేషన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అనంతరం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 16 న  తొలిసారిగా .. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రకియ ప్రారం భమవుతుందన్నారు

జిల్లాలో ఈనెల 16 నుండి మొదటి విడత కోవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించి ప్రతి నియోజకవర్గానికి రెండు కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు  చొప్పున జిల్లా వ్యాప్తంగా 29 కేంద్రాల యందు కోవిడ్ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని మొదటి విడతలో భాగంగా హెల్త్ కేర్  వర్కర్లకు వ్యాక్సినే షన్ చేసేందుకుఏర్పాట్లు చేశామని ఇప్పటికే 37,703 మందిని మొదటి జాబితా లో సిద్ధం చేయడం జరిగిం దని తెలిపారు. జిల్లాకు 41,500 డోసులు వ్యాక్సిన్ అందడం జరిగిందని, ప్రతి సెంటర్ నందు రోజుకు వంద మందికి వ్యాక్సినేషన్ చేయ డం జరుగుతుందని తెలి పారు...

తిరుపతి స్విమ్స్,రుయా ఆసుపత్రులలో గౌ. ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నులు శాఖ మాత్యులు కె.నారా యణ స్వామి,గౌ.రాష్ట్ర పం చాయతీరాజ్ గ్రామీణాభి వృద్ధి శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లు కోవిడ్ వ్యాక్సినేషన్ ను ప్రారంభిస్తారని తెలిపారు..

రెండో విడతలో పోలీసు, రెవిన్యూ, మున్సిపాలిటీ పంచాయతీరాజ్ శాఖకు చెందిన వారికి, మూడో విడతలో ప్రతి సచివాలయం నందు, ఆరోగ్య కేంద్రాల యందు సాధారణ ప్రజలు 50 సంవత్సరాలు పైబడిన వారికి 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న కోమార్బడ్ తో బాధపడు తున్న వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు ..
వ్యాక్సినేషన్ అనంతరం సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ప్రతి కేంద్రం నందు తగిన వైద్య సదుపా యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు..

Related Posts