నెల్లూరు జిల్లా పొదలకూరు మండల పరిధిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ బాధితులైన చెరుకు రైతులను మరియు కార్మికులను ఆదుకోవాలని బిజెపి సీనియర్ నేత మిడతల రమేష్ డిమాండ్ చేశారు.
రైతుల బకాయిలు చెల్లింపుల కొరకు 4 కోట్ల 30 లక్షల చెక్కును షుగర్ కేన్ అసిస్టెంట్ కమిషనర్ దగ్గర ఇచ్చిన షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆ చెక్కును బ్యాంకులో జమ చేయకుండా ఒత్తిడి చేస్తున్నారు.750 మంది చెరుకు రైతులు, 350 మంది కార్మికులు షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్య నిరంకుశ వైఖరికి బలైపోయి ఉన్నారని రమేష్ తెలిపారు.రెవిన్యూ రికవరీ ఆక్ట్ ద్వారా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మిడతల రమేష్ తో బాటు చింతగింజల సుబ్రహ్మణ్యం, రాచపుటి దనుంజయ్,ఓజిలీ సుధాకర్,ప్రశాంత్ , పిచ్చయ్య తదితరులు వున్నారు.