పరవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో (పి. హెచ్.సి) లో కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ ను ముఖ్య అతిధి గా విచ్చేసిన పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు అదీప్ రాజ్ గారు మాట్లాడుతూ కిందటి సంవత్సరం మార్చ్ నెల నుంచి నేటి వరకు కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. అలాంటి తరుణంలో ఇవాళ భారత దేశం లో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ పూర్తిగా వ్యవస్థలన్నీ కూడా స్తంభించపోయే విదంగా లాక్ డౌన్ ప్రకటించే పరిస్థితులు, కానీ మనకి తెలిసి ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అనేక కార్యక్రమాలు చెయ్యడం జరిగింది. అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటిని పరిశీలించి ఇవాళ మన దేశం లో నే కోటికి పైగా టెస్ట్ లు చేసినటువంటి రాష్ట్రం ఎదైన ఉంది అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రం అని చెప్పారు . అదే విదంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ ప్రభుత్వం ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సి ఈ సి సభ్యులు పైల శ్రీనివాసరావు , రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బైలపూడి భగవాన్ జై రామ్ , మాజీ ఆర్ ఈ సి ఎస్ డైరెక్టర్ సబ్బవరపు నారాయణమూర్తి , జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు , మండల పార్టీ అధ్యక్షులు సిరిపురపు అప్పలనాయుడు , పరవాడ తహసీల్దార్ బి.వి రాణి , ఎం.డి.ఓ హేమసుందర్ రావు, సర్పంచ్ అభ్యర్థులు, ఎం.పి. టి. సి అభ్యర్థులు, నాయకులు, పి.హెచ్.సి డాక్టర్లు ఐ. రవీంద్ర రంజిత్,మరియు వైద్య సిబ్బంది,పంచాయతీ సిబ్బంది,వాలంటీర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఏ. ఎన్. ఎం లు , కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.