నేటి పరిణామాల దృష్ట్యా యువత ఆర్మీలో చేరాలని గౌతమబుద్ధుడు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కోశాధికారి జయ ప్రకాష్.ఆరవ రాయప్ప ఏ .రామ్మోహన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు .శుక్రవారం స్థానిక స్వతంత్య్ర పార్కులో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశాన్ని ఎల్లవేళలా రక్షిస్తున్న ఆర్మీకి ప్రజలందరూ రుణపడి ఉంటారన్నారు .ప్రతి విద్యార్థి తాను డాక్టర్ కావాలని, ఐఏఎస్ లాంటి ఉన్నత ఉద్యోగంలో చేరాలని ఆశిస్తున్నారని, ఆర్మీలో చేరేందుకు అంతా ముందుకు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు .రాత్రింబవళ్లు దేశాన్ని రక్షిస్తున్న ఆర్మీకి వారు కృతజ్ఞతలు తెలియజేశారు .పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి ఒక సైనికుడు న్నారని వారికి అభినందనలు తెలియజేశారు .యువత ఆర్మీలో చేరేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ,సేవా సంస్థలు కృషి చేయాలని వారు కోరారు .కనుమ పండుగ సందర్బంగా రైతులకు వారు ధన్యవాదాలు తెలిపారు .రైతులు లేనిది దేశం లేదని, రైతులు అతివృష్టి, అనావృష్టి ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని ప్రజలకు అన్నం పెడుతున్న దేవతామూర్తుల్ని వారు కొనియాడారు .జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలిచ్చారు .ఈ సందర్భంగా చిన్నారులకు చాక్లెట్లను పంపిణీ చేశారు.