YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

జీహెచ్‌ఎంసీలో గెలిచిన అభ్యర్థుల గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ

జీహెచ్‌ఎంసీలో గెలిచిన అభ్యర్థుల గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పేర్లతో గెజిట్‌ విడుదలైంది. ఇవాళ్టి తేదీతో ఎస్‌ఈసీ గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 4వ తేదీ వెలువడిన విషయం తెలిసిందే. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఈ నెలఖారులో మేయర్‌ ఎన్నిక తేదీ ఖరారు కానుంది. త్వరలోనే కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జీహెచ్‌ఎంసీలో పార్టీల వారీగా బలాబలాలిలా ఉన్నాయి. మొత్తం 150 డివిజన్లకు గాను అధికార టీఆర్‌ఎస్‌-56, బీజేపీ-48, మజ్లిస్‌-44, కాంగ్రెస్‌-2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఎక్స్‌ అఫిషియోలతో కలిపి పార్టీల బలాబలాలు పరిశీలిస్తే టీఆర్‌ఎస్‌కు 56 మంది కార్పొరేటర్లు. 35 మంది దాకా ఎక్స్‌ అఫిషియోల బలం. దీంతో వీరి బలం 91కి చేరుకుంటుంది. బీజేపీకి 48 మంది కార్పొరేటర్లు(అయితే కొవిడ్‌ కారణంగా లింగోజిగూడ కార్పొరేటర్‌ రమేష్‌ గౌడ్‌ మృతిచెందారు), ముగ్గురు ఎక్స్‌ అఫిషియోలతో కలిపి వారి బలం 50. మజ్లీస్‌కు 44 మంది కార్పొరేటర్లు. 10 మంది ఎక్స్‌ అఫిషియోలతో కలిపి వీరి బలం 54. కాంగ్రెస్‌కు ఇద్దరు కార్పొరేటర్లు, ఒక ఎక్స్‌ అఫిషియోతో కలిపి మూడు ఓట్లు ఉంటాయి.

Related Posts