కోవిడ్ 19 తొలిదశ వ్యాక్షినేషన్ కార్యక్రమాన్ని నందికొట్కూరు శాసనసభ్యులు తోగురు ఆర్థర్ పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించారు తొగురు ఆర్థర్ .
ఈ సందర్భంగా కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ .... కారోనా మహమ్మారి ద్వారా ఎందరినో కుటుంబాలు నష్టపోయాయని సభ్యులను,ఆప్తులను పోగొట్టుకున్నామని, వారి కడసారి వీడ్కోలు కూడా సాంప్రదాయాల ప్రకారం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కరోనా ద్వారా చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు. ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన ఈ మహమ్మారికి టీకా ను కనుకొన్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియచేశారు. రాష్ట్రంలో కరోనాకి టీకా కార్యక్రమం, కార్యరూపం దాలుస్తుందని ముందుగా మొదట టీకాను హెల్త్ కేర్ సిబ్బందికి అంటే డాక్టర్లు, నర్సులు, పారామెడికల్,ఆరోగ్య సేవలకు సంబంధించిన వారికి ఇవ్వటం జరుగుతుందని అన్నారు. పాములపాడు ఆరోగ్య కేంద్ర పరిధికి 445 టీకాలు వచ్చాయని తెలిపారు.
రాబోయే కొన్ని రోజులవ్యవధిలో అందరికి టీకా అందుబాటులోకి వస్తుందన్న అంచనా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ,వైరస్ విషయం లో తీసుకోవలసిన నివారణ చర్యల పట్ల ఎలాంటి అజాగ్రత్తకు తావు ఇవ్వకూడదంటూ ఎమ్మెల్యే మరోసారి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు జాయింట్ కలెక్టర్ ఖాజా మొయినుద్దీన్ ,నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ వేణు గోపాల్ ,అడిషనల్ డి. ఎం.హెచ్.ఓ. వెంకట రమణ , మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మెహబూబ్ భాష వైద్య అధికారిని ,రోషిణి ఎంపిడివో రాణమ్మ, తహసీల్దార్ వేణుగోపాల్ రావు, ఎంఈవో బాలాజీ నాయక్, వైసిపి నాయకులు వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ రామ సుబ్బయ్య, శ్రీనివాస్ రెడ్డి, రామలింగేశ్వర రెడ్డి , ముర్తుజావలి, మాలిక్ భాష, బంగారం మౌలాలి, చౌడయ్య, భీమ శేఖర్, రఘురామిరెడ్డి , ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.