పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో మకర సంక్రాంతి పర్వదినాన, రైతు సంఘం నాయకుడు క్రీ"శే" కోట్రికే సుధాకర్ శెట్టి జ్ఞాపకార్థంగా గ్రామంలో గ్రామానికి వన్నెతెచ్చినటువంటి 28 మందికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హోసూరు గ్రామ పెద్దలు సురేంద్ర నాథ్ రెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయులు బారికి రంగయ్య, సుద్దుల అంజయ్య , మాజీ వార్తా విలేఖరి గోపాల్, గ్రామ పురోహితులు మురళి స్వామి హాజరై వారిని సన్మానించడం జరిగింది.
ఈ సమావేశనికి నేటూరి వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా రిటైర్డ్ రెవెన్యూ అధికారి సురేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ హోసూరు గ్రామం లో కోట్రికే సుధాకర్ శెట్టి గ్రామాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, అలాగే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని తెలియజేశారు... ఆయన సేవలు మరువలేనివని ఆయన ఆశయ సాధన కోసం మనమందరం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.. రైతుల కోసం రైతుల సమస్యలపై పోరాడే వారిని తెలిపారు.కోట్రికే సుధాకర్ శెట్టిగారి జ్ఞాపకార్ధంగా ఆయన కుమారులు వెంకటేశ్వర గుప్తా, రామసుబ్బయ్య గుప్తా ,రాజ నారాయణ గుప్త గ్రామం లో సామాజిక సేవ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
గ్రామంలోని ప్రతిభావంతులను , కళానైపుణ్యం, సంస్కృతి, వృత్తి నైపుణ్యంలో అభివృద్ధి చెందిన అటువంటివారిని, గ్రామం కోసం విశిష్ట సేవలు చేసిన వారికి అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచిన వ్యక్తులను గుర్తించి వారికి దాదాపు28 వ్యక్తులకు
" సుధాలయ్య స్మారక సేవ ప్రతిభ పుష్కర అవార్డులను " అందజేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో మోహన్ కృష్ణ శ్రీనివాసులు హరి తారన రాఘవేంద్ర బ్రహ్మయ్య యువత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.