నందవరం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరుగుతున్న పుష్కర ఘాట్ల నిర్మాణాల పై టిడిపి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాధవరావు దేశాయ్ మాజీ మండల కోఆప్సన్ మెంబర్ కాశీం వలీలు అసంతప్తి వ్యం చేశారు.ఆదివారం మండల పరిధిలోని నాగలదిన్నె ,గురజాల గ్రామాల్లో టిడిపి నాయకులు పుష్కర ఘాట్ల పనులను పరిశీలించారు. వారు మాట్లాడుతూ కోట్లు ఖర్చు పెట్టి పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయిస్తున్న ప్రభుత్వం వాటి నాణ్యతను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.నది స్నానాలకు భక్తులకు అనుమతి లేనప్పుడు కోట్ల రూపాయలు పెట్టి మాట్లను ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నించారు.పట్ల నిర్మాణాలను రోజులలో నిర్మిస్తే వాటి నాణ్యత ఎంతలా ఉంటుందో అర్ధమవుతుందని,వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైకాపా ప్రభుత్వం నీటి పాలు చేస్తుందన్నారు.నది పక్కనే ఘాట్లు నిర్మిస్తున్నా , వాటి క్యూరింగ్ కి నీటిని కూడా వాడడం లేదన్నారు.గురణాలలో ఉన్న శ్రీ రామలింగేశ్వర దేవాలయంలోని భీమాలింగ దేవాలయాన్ని వాస్తు పేరు చెప్పి దేవాదాయ శాఖ అనుమతి లేకుండా ఆలయ - పడగొట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.టిడిపి నాయకులు డా ,ఈరన్న ధర్మపురం గోపాల్,జబ్బార్ , లచప్పు , సోమన్న ఆదిశేషు ,వీరేష్ ,బ్రహ్మానందరెడ్డి ,రామన్నగౌడ్,దావీదు,శీను,ఈరన్న ,వెంకటేష్ , కాశం తదితరులు పాల్గొన్నారు.