YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

శ్రీ రెడ్డి... మళ్లీ టార్గెట్ చేసింది

శ్రీ రెడ్డి... మళ్లీ టార్గెట్ చేసింది

శ్రీరెడ్డి మరోసారి పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, పోస్టులు పెట్టింది. "గూండాగిరి చేస్తే స్పెషల్ స్టాటస్ రాదు పీకే... ప్రాస్టిట్యూషన్ ను లీగలైజ్డ్ చేయాలని అంటున్నది వాకాడ అప్పారావు కోసమా? 3, 4 పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లకా?" అని ఓ పోస్టులో ప్రశ్నించిన శ్రీరెడ్డి, "ఏదో పొలిటికల్ అజెండాతో (చంద్రబాబునాయుడి దీక్ష నుంచి చూపు మరల్చేందుకు) అమ్మ పేరుతో నిన్న మా అసోసియేషన్ కు వచ్చిన నువ్వు, ఫుల్ నెగటివ్ మార్కులు వేయించుకుని వెళ్లావు. మీ అమ్మకు నువ్విచ్చిన విలువ కన్నా నేను ఎక్కువ విలువ ఇస్తాను. మా మహిళా సంఘానికి ఆవిడ పేరే పెడుతున్నాను. జిందాబాద్ అంజనా దేవీ" మరో పోస్టు పెట్టిందిఇక 'బట్టలు విప్పి మాట్లాడుకుందాం' అని పవన్ పెట్టిన పోస్టుపై స్పందిస్తూ, "కొత్త సినిమా... 'రాళ్లేసి కొట్టుకుందాం రా'... 'తిక్కకి లెక్క లేదు' ఈ పేరు కూడా బాగుంటుంది" అని వ్యాఖ్యానించింది. తాను ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, చంద్రబాబుకు మద్దతిస్తానని, అయితే ఏంటని కూడా ప్రశ్నించింది. "నువ్వు చితక్కొట్టించింది మీడియా వాళ్ల కార్లను కాదు. జర్నలిస్టుల మనోభావాలని... కాస్కో నా వాస్కోడిగామా" అని మరో పోస్టు పెట్టింది శ్రీరెడ్డి.ఫేస్ బుక్ ఖాతాలో పలు పోస్టులను పెట్టిన ఆమె, గాయత్రి, రాధ, కల్యాణిల పేర్లు చెబుతూ, వారందరి సంగతి తనకు తెలుసునని వ్యాఖ్యానించింది. నాకు గాయత్రి గత జీవితం గురించి తెలుసు. ఆమె ఎవరి దగ్గర ఎంత డబ్బు తీసుకుంది? పెళ్లయిందా? కాలేదా? బాయ్ ఫ్రెండ్స్ ఎవరెవరు? అన్న విషయాలు నాకు తెలుసు. నాకు అమ్మాయిలపై గౌరవం ఉంది కాబట్టి వాటిని బయటపెట్టే ఉద్దేశం లేదు. తరువాత రాధ... మా టీవీలో ఆ అమ్మాయిని పీకేసి నన్ను 'పాతాళ భైరవి' ప్రోగ్రామ్ లో పెట్టారు. దానిపై ఇంత ఆగ్రహంతో ఉందని అనుకోలేదు" అని ఉదయం 9 గంటల సమయంలో ఓ పోస్టు పెట్టింది.ఆపై, "కల్యాణి లైఫ్ హిస్టరీలో ఎన్ని పోలీసు కేసులు, కోర్టు కేసులు ఉన్నాయి. ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంది.. దేవుడు లక్కీగా పిల్లలను ఇవ్వలేదు. ఉండుంటే పాపం వాళ్లను తన్నేసేది. 2011 యూఎస్ లో ఏం జరిగిందో అందరూ చెప్పారు. ఈవిడ పెట్టే టార్చర్ గురించి మాజీ భర్త చేసిన వ్యాఖ్యలు... నేనేమీ చెప్పను. కొన్ని విలువలను నేను పాటిస్తాను" అని వ్యాఖ్యానించింది.ఆపై 10 గంటల సమయంలో "నా పర్సనల్ లైఫ్ మీద అబద్ధాలతో కూడిన ప్రచారం చేస్తున్న వారికి... లీగల్ కేసులు పెరుగుతాయి. వెంటనే వీడియోస్ తీయించకపోతే బాగోదు. నేను ఇక మాట్లాడను దీనిపై. ఇప్పటికే కేసులు ఉన్నాయి మీపైన. ప్రజలను వేధించడం మానుకోండి. నన్ను మానసికంగా హింసించే హక్కు, నన్ను విమర్శించే హక్కు, అబద్ధాలతో ప్రచారం చేసే హక్కు మీకు లేదు. ఊరుకుంటుంటే చాలా ఓవర్ చేస్తున్నారు. మీకు లీగల్ ఫైట్ తప్పదు. ఖబడ్దార్ కల్యాణి, గాయత్రి... మరికొన్ని పేర్లు త్వరలో వస్తాయి" అని చెప్పింది"ఈరోజు వరకూ నన్ను ఇరిటేట్ చేసిన వారిపై మాత్రమే నేను నిందారోపణలు చేశా. అనవసరంగా నా వ్యక్తిగత జీవితం మీద ఎవరు మాట్లాడినా తాట తీస్తా. లీగల్ గా ఇరుక్కోకుండా ఉండటం మంచిది. తరువాత... కేసులు పెట్టిన తరువాత వేధిస్తే ఉపయోగం లేదు. పవన్ వ్యవహారం వేరే. నేను ఇప్పటికే నా అభిప్రాయం చెప్పాను. క్షమాపణలు కూడా కోరాను" అని మరో పోస్టు పెట్టింది శ్రీరెడ్డి.

Related Posts