YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సచివాల య వ్యవస్థ - రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

దేశంలో ఏ రాష్ట్రంలో లేని  విధంగా  సచివాల య వ్యవస్థ - రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి



దేశంలో ఏ రాష్ట్రంలో లేని  విధంగా  సచివాల య వ్యవస్థ మన రాష్ట్రం లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.  శనివారం పార్లమెంటరీ స్టాండింగ్ కమి టీ జిల్లా పర్యటన లో భాగం గా పులుచెర్ల మండలం దిగువ పోకల వారి పల్లి లో మంత్రి విలేకరులతో మాట్లా డుతూ రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రం లో గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ వినూత్న రీతిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలి పారు..  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఆద్వర్యంలో ప్రతి గ్రామంలో ను 50 ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ ను అదేవిధంగా వార్డు సెక్రటేరియట్ లో దాదాపు11 నుంచి 14 మంది వివిధ శాఖలకు సంబందించిన కార్యదర్శులతో ప్రతి 2000 జనాభా కు ఒక గ్రామ సచివాలయాన్ని మంజూరు చేసిందే కాకుండా వాటికి సంబందించిన సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రం, గ్రామీణ ఆరోగ్య హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేయడం జరుగుతున్నదని , బల్క్ మిల్క్ సేకరణ చర్య లు చేపడుతున్నామని తెలిపారు.. (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం)నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మెషిన్ క్రింద కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన కార్యక్రమాలను సెర్ప్, డ్వామా పి.డి లు పర్యవేక్షించడమే కాకుండా సచివాలయ భవనాలతో పాటు మిగతా భవనాలు అన్నీ కూడా మార్చి 31 లోపల పూర్తి చేయాలన్నారు. అవన్నీ కూడా పార్లమెంటరీ కమిటీ చిత్తూరు జిల్లాలో పర్యటించి పర్యవేక్షించడం జరుగుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వo చేపట్టే అభివృద్ది కార్యక్రమాలు అన్నీ కూడా వారికి వివ రంగా తెలియ పరచి, తప్ప ని సరిగా కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ పూర్తి స్థాయిలో ప్రయోజనకరంగా సద్వినియోగ పరుస్తున్నామని తెలిపారు. నా నియోజక వర్గంలో ఈ పార్లమెంటరీ కమిటీలు పర్యవేక్షిస్తూండడం అనేది వారికి సంతోశకరంగా ఉన్నదని తెలిపారు. తప్పకుండ ఈ పార్లమెంటరీ కమిటీ పర్యటన విజయ వంతం కావాలని  తెలిపారు.

Related Posts