YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ పీకే...ట్రబుల్ షూటర్ ..

మళ్లీ పీకే...ట్రబుల్ షూటర్ ..

తిరుపతి, జనవరి 18, 
ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంత్ కిషోర్ కు మళ్లీ పనిపడినట్లే కన్పిస్తుంది. ఆయన సేవలను మరోసారి వినియోగించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తిరుపతి ఉప ఎన్నిక కారణంగానే ఏపీలో ఆలయాలపై వరస దాడులు జరుగుతున్నాయని, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను టార్గెట్ చేస్తున్నారని జగన్ అనుమానిస్తున్నారు. మరోవైపు సంక్షేమ పథకాల నుంచి ప్రజల దృష్టిిని మళ్లించేందుకే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని జగన్ గట్టిగా విశ్వసిస్తున్నారు.దీంతో తిరుపతి ఉప ఎన్నికతో పాటు మరికొన్ని అంశాలపై ప్రశాంత్ కిషోర్ టీం సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రధానంగా తిరుపతి ఉప ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సర్వే చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ సర్వే పనులను ప్రశాంత్ కిషోర్ టీం కు అప్పగించాలని భావిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతుంది. తన రెండేళ్ల పాలనలో జనం తన ప్రభుత్వంపై ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు.అందుకే వివిధ సంక్షేమ పథకాలను పూర్తిగా మరో రెండు నెలల్లో గ్రౌండ్ చేస్తారు. ఆ తర్వాత సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలను సర్వే ద్వారా తెలుసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇక మంత్రుల పనితీరుపై కూడా జగన్ సర్వే చేయించదలచుకున్నారు. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉండటంతో మంత్రుల పనితీరు కూడా ప్రశాంత్ కిషోర్ సర్వేలో ప్రధాన అంశంగా మారిందని చెబుతున్నారు.ఇక 175 నియోజకవర్గాల్లో ఒకసారి సర్వే చేయించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకోవాలనుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముందు ముందు ఉండటంతో పార్టీ ఎక్కడ బలంగా ఉందీ? బలహీనంగా ఉందీ? అన్నది జగన్ తెలుసుకోనున్నారు. ఈ బాధ్యతలన్నీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు అప్పగించారంటున్నారు. మరోసారి ఏపీలో ప్రశాంత్ కిషోర్ కు మంచి పనిపడినట్లే

Related Posts